విద్యారణ్యపురి : ప్రభుత్వం నివేదిక తెప్పించుకుని వెంటనే పీఆర్‌సీని ప్రకటించి ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. పీఆర్‌టీయూ టీఎస్ హనుమకొండ జిల్లా గౌరవ అధ్యక్షుడు చిట్టిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఏ (సోషల్‌స్టడీస్ )గా విధులు నిర్వర్తిస్తూ ఈనెలాఖరున ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా శుక్రవారం హనుమకొండలో నిర్వహించిన సన్మానసభలో ఎమ్మెల్సీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్‌సీ 51శాతం ప్రకటించాలన్నారు. శ్రీనివాస్‌రెడ్డి 40 ఏళ్లుగా ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తూ అందరి మన్ననలు పొందారన్నారు. ‘కుడా’ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఎ. అజిత్‌రెడ్డి, హనుమకొండ, హసన్‌పర్తి ఎంఈఓలు నెహ్రూ, శ్రీనివాస్, పీఆర్‌టీయూ హనుమకొండ జి ల్లా అధ్యక్షుడు ఫలితశ్రీహరి, జిల్లా జనరల్ సెక్రటరీ ఎడ్ల ఉపేందర్‌రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు మంద తిరుపతిరెడ్డి, వరంగల్, మహబూబాబాద్, జనగామ జిల్లాల అధ్యక్షులు ఈదునూరి రవీందర్‌రెడ్డి, సతీశ్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
నేడు కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రద్దు
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో శనివారం రద్దు చేసినట్లు రైల్వే అధికారులు శుక్రవారం రాత్రి తెలిపారు. తుపాన్ కారణంగా సీఎస్‌టీ ముంబాయి–భువనేశ్వర్ న్యూ (11019) కోణార్క్‌ను రద్దు చేసినట్లు వివరించారు.
రైళ్ల దూరం తగ్గింపు..
సెంట్రల్ రైల్వే ముంబయి నాగ్‌పూర్ రైల్వే డివిజన్ పరిధిలో గల వార్దా– బల్లార్షా రైల్వే యార్డు ప్రాంతంలో 3వ లైన్ ప్రాజెక్ట్ వర్క్స్‌తో కాజీపేట, వరంగల్ మీదుగా బల్లార్షా వరకు ప్రయాణించే వివిధ రైళ్లను మణిఘర్ వరకే నడిపిస్తున్నట్లు శుక్రవారం రాత్రి రైల్వే అధికారులు తెలిపారు.
దూరం తగ్గించిన రైళ్లు..
నవంబర్ 2, 3,4వ తేదీల్లో కాజీపేట–బల్లార్షా (17035) ఎక్స్‌ప్రెస్, 3,4,5వ తేదీల్లో బల్లార్షా–కాజీపేట (17036) ఎక్స్‌ప్రెస్, 3,4వ తేదీల్లో భద్రాచలం–బల్లార్షా (17033) సింగరేణి, 3,4వ తేదీల్లో బల్లార్షా–కాజీపేట (17004) సింగరేణి ఎక్స్‌ప్రెస్ మణిఘర్ వరకే నడిపించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి


