న్యూస్‌రీల్
నవంబర్‌లో ఓపీ సేవలు!
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ప్రస్తుతం వాయిదాపడిన ఓపీ సేవలను తిరిగి నవంబర్ మొదటి వారంలో ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
సాక్షి, మహబూబాబాద్: అన్నిశాఖలకు ఆదర్శంగా ఉండాల్సిన విద్యాశాఖకు గ్రహణం పట్టుకుంది. జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేసేందుకు అధి కారుల్లో వణుకు పుడుతోంది. పనిచేయలేక కొంద రు, పరిస్థితి అనుకూలించక మరి కొందరు జిల్లాకు వచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఇన్‌చార్జ్ బాధ్యతలు కూడా వద్దంటున్నారు. జిల్లా అధికారి సీటు కలిసిరావడం లేదని భయపడుతున్నారు.
పనిచేయలేక కొందరు..
పరిస్థితి అనుకూలించక కొందరు..
మొదటి నుంచి మహబూబాబాద్ విద్యాశాఖ అధికారిగా వచ్చేందుకు అధికారులు ఇష్టపడడం లేదు. ఇప్పటి వరకు జిల్లాకు వచ్చిన నాగేశ్వర్‌రావు కొద్దికాలంలోనే పదవీ విరమణ పొందారు. తర్వాత వచ్చిన సోమశేఖర శర్మ తనదైన శైలిలో పనిచేసి కొత్తగూడెం జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వచ్చిన అబ్దుల్‌హై కూడా ఇక్కడ పనిచేయడం ఇష్టం లేదని పట్టుబట్టి బదిలీ చేయించుకున్నారు. తర్వాత వచ్చిన రామారావు పనిచేసిన సమయంలో కార్యాలయంలో గొడవ లేని రోజు లేదు. ఇందులో భాగంగానే ఆయనను విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో వచ్చిన రవీందర్ రెడ్డి గతంలో ఇక్కడ పనిచేసిన అనుభవంతో ఒక వైపు అకడమిక్, మరోవైపు అడ్మినిస్ట్రేషన్‌ను సరిదిద్దారు. ఆయన ప్రయత్నం ఫలించి గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలిపారు. ఆయన పదవీ విరమణ పొందడంతో సీటు ఖాళీ అయ్యింది. ఆ తర్వాత సూర్యాపేట ఏడీగా పనిచేసిన దక్షిణామూర్తి బదిలీపై వచ్చారు. వచ్చిన కొద్దిరోజుల ఉత్సాహంగా పనిచేసిన డీఈఓ తర్వాత జిల్లా నుంచి ఎప్పుడు వెళ్దాం అనే పనిలోనే ఉన్నట్లు విద్యాశాఖ ఉద్యోగులు చెబుతున్నారు. ఇంకా సర్వీస్ ఉండగానే వీఆర్‌ఎస్ పెట్టుకొని వెళ్లిపోయారు. ఆయన స్థానంలో బాధ్యతలు తీసుకునక్న ఏడీ రాజేశ్వర్ ఖమ్మం ఏడీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వచ్చిన సత్యనారాయణమూర్తి కొంత మేరకు జిల్లా పరిస్థితి అర్థం చేసుకొని వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నించగా.. దురదృష్టవశాత్తు ఆయన కుమారుడు చనిపోయారు. దీంతో మనోవేదనలో ఉన్న ఆయన మహబూబాబాద్‌కు వెళ్లలేనని ఉన్నతాధికారులకు చెప్పడంతో.. ఆయన స్థానంలో ఖమ్మం డీఈఓ వాసంతికి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఆమె ఇక్కడ జాయిన్ కాకుండానే నాకొద్దు మానుకోట అని చెప్పినట్లు తెలిసింది. దీంతో హనుమకొండ జిల్లా ఏడీగా పనిచేస్తున్న సత్యనారాయణకు డీఈఓ బాధ్యతలు అప్పగించారు. ఆయితే ఆయన కూడా జిల్లాకు వచ్చేందుకు సుముఖంగా లేరనే ప్రచారం జరుగుతోంది.
ఎక్కడ లేని విధంగా మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖలోనే ఎందుకు ఇలా జరుగుతుందని ఆశాఖలో చర్చగా మారింది. జిల్లా కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల మధ్య సమన్వయం లేకపోవడం, ఇన్‌చార్జ్ బాధ్యతలు వ్యవహరించేవారిలో ఎప్పుడు రిలీవ్ అవుతామో అనే అభద్రతాభావం ఉండడం, అదేవిధంగా ఉద్యోగుల కొరత, ఉన్నవారిలో కొందరికి పని రాకపోవడం, రాజకీయాలు ఎక్కవగా ఉండడం కారణంగా చర్చ జరుగుతోంది. అదే విధంగా కొత్త డీఈఓ వస్తే కోటరీగా ఏర్పడడం, ఉన్నతాధికారుల ఉత్తర ప్రత్యుత్తరాలకు సమాధానాలు ఇవ్వడంలో జాప్యం చేయించడం, అధికారులు ఆగ్రహించిన విషయం ప్రచారం చేయడం, ఇక్కడ పనిచేస్తే ఇలాగే ఉంటుందనే భయాందోళన కలిగించడం పరిపాటిగా మారిందనే చర్చ. దీంతో ఇక్కడికి రావడానికే సుముఖంగా ఉండని అధికారులు.. వచ్చీ రాగానే.. సమస్యలు పెద్దగా కన్పించడం.. ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్దామా అని ప్రయత్నాలు చేసే పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితిలో విద్యాశాఖ ఉంటే.. రోజుకో చోట సమస్యలు, పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం వంటి సమస్యలు సవాల్‌గా ఉన్నాయి.
జిల్లా విద్యాశాఖ అధికారిగా రావడానికి విముఖత
పనిచేయలేక కొందరు, పరిస్థితి అనుకూలించక మరికొందరు
ఇన్‌చార్జ్ బాధ్యతలు కూడా
వద్దంటున్న అధికారులు
సారథి లేకపోవడంతో చతికిల పడుతున్న చదువులు


