ఉమ్మడి జిల్లాలో ఇలా..
కాజీపేట అర్బన్: ఎకై ్సజ్ శాఖకు దసరా జోష్ సంతరించుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మందుబాబులు రూ.173.47 కోట్ల మద్యం తాగేశారు. ఏడాది పొడవునా మద్యం విక్రయాలు ఒక తీరైతే కేవలం దసరా పండుగ రోజున మాత్రం ఆ తీరే వేరు. బార్లు, వైన్స్‌ల చుట్టూ మందుబాబుల క్యూ కడుతూ ఉమ్మడి జిల్లాలోని 139 బార్లు, 295 వైన్స్‌లలో రూ.173.47 కోట్ల మద్యం కేవలం దసరా పండుగ విక్రయాలు జరిగాయంటేనే మందుబాబుల జోష్ తెలుస్తోంది. కాగా గతేడాది.. రూ.163.56 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా.. ఈ ఏడాది రూ.173.47 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. గతేడాది కంటే రూ.10 కోట్లతో ఎకై ్సజ్‌శాఖ కిక్కునిచ్చింది.
ఉమ్మడి జిల్లాలో టాప్ హనుమకొండ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ట్రైసిటీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వరంగల్ అర్బన్ (హనుమకొండ)జిల్లాలో అత్యధికంగా లిక్కర్ సేల్స్ కొనసాగుతుంటాయి. మద్యం టెండర్లు వెలువడితే చాలు వరంగల్ అర్బన్‌లో ఒక్క వైన్స్ వచ్చినా చాలు అంటూ పోటీపడుతుంటారు. అదేవిధంగా మద్యం విక్రయాల్లోనూ ఉమ్మడి జిల్లాలోని వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి జయశంకర్ జిల్లాలతో పోటీ పడి వరంగల్ అర్బన్ టాప్‌లో నిలుస్తూ రూ.67.86 కోట్ల మద్యం విక్రయాలు కొనసాగించింది.
బార్లు: 139
వైన్స్: 295
వరంగల్ అర్బన్67.86
వరంగల్ రూరల్28.55
జనగామ
28.75
మహబూబాబాద్29.46
జయశంకర్ భూపాలపల్లి 18.85
ఉమ్మడి జిల్లాలో రూ.173 కోట్ల మద్యం తాగేశారు
గతేడాది కంటే రూ.10 కోట్ల అధిక ఆదాయం
ఉమ్మడి వరంగల్‌లో టాప్‌లో వరంగల్ అర్బన్ (హనుమకొండ)


