అంబరాన్నంటిన దసరా సంబురాలు | - | Sakshi
Sakshi News home page

అంబరాన్నంటిన దసరా సంబురాలు

Oct 22 2026 3:44 AM | Updated on Oct 22 2026 3:44 AM

రావణ

వధ

దసరా వేడుకల్లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మురళీనాయక్‌

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లాలో దసరా సంబురాలు అంబరాన్నంటాయి. ప్రజలు, అధికారులు దేవాలయాలకు వెళ్లి శమీ పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని హన్మంతునిగడ్డ శివాలయం ప్రాంగణంలో మంగళవారం జరిగిన దసరా సంబురాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు, యువతులు, యువకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పలు చోట్ల ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకున్నారు. అన్ని మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో సైతం దసరా ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. జమ్మి చెట్టుకు పూజ చేయడంతోపాటు పనిముట్లు, యంత్రాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. వేడుకల్లో పాల్గొన్న ప్రజలు జమ్మి ఆకును బంగారంగా భావిస్తూ ఒకరినొకరు ఇచ్చి పుచ్చుకున్నారు. జిల్లా కేంద్రంలో హన్మంతునిగడ్డ దసరా ఉత్సవాల్లో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌ హాజరై మాట్లాడుతూ.. చెడుపై మంచి విజయం సాధించిందని, ప్రస్తుతం మానుకోటలో శ్రీరామరాజ్యం నడుస్తుందన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలు క్షేమంగా ఉన్నారని, ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారు. మానుకోట పట్టణంలోని బంధం చెరువుపై ట్యాంక్‌బండ్‌ నిర్మాణానికి సుమారు రూ.7కోట్ల కేటాయించినట్లు తెలిపారు. మానుకోటలో ప్రతీ పండుగను సుఖ సంతోషాలతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుగులోతు జ్యోతి రమేష్‌నాయక్‌ మాట్లాడారు. అనంతరం మహబూబాబాద్‌ మున్సిపల్‌ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సూర్నపు సోమయ్య, వ్యవసాయ మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ మధన్‌గోపాల్‌లోయ, కౌన్సిలర్లు సరిత, రాజు, భాస్కర్‌, అజయ్‌సారథి, రవి, దిలీప్‌, నవీన్‌, సంధ్య, అరుణ, లావణ్య, ధనలక్ష్మి, పార్వతి, స్పందన, శ్రీదేవి, శివ, రజిత, ఐశ్వర్య, వెంకన్న, నరేష్‌, డీఈ ఉపేందర్‌ నాయకులు పాల్గొన్నారు.

జిల్లావ్యాప్తంగా ఘనంగా వేడుకలు

ఆయుధ పూజ, వాహన పూజ చేసిన ప్రజలు

వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement