మహబూబాబాద్: జిల్లాలో కొంతమంది మీసేవ కేంద్రాల నిర్వాహకులు దరఖాస్తుదారుల నుంచి అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. రశీదు బదులు ఈ స్లిప్ విధానంతో వారి దోపిడీకి మరింత వెసులుబాటు కల్పించినట్లు అయ్యింది. ఇటీవల డ్వాక్రా గ్రూపు రుణాల కోసం ఉద్యమం రిజిస్ట్రేషన్ తప్పనిసరి కావడంతో ఇదే అదునుగా భావించిన కొంత మంది నిర్వాహకులు ఉన్న ఫీజు కంటే మూడింతలు ఎక్కువగా తీసుకుంటున్నారు. సంబంఽధిత అఽధికారుల పర్యవేక్షణలోపంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. త్వరలో మీసేవ కేంద్రాల్లో కొన్ని నూతన సేవలు అమలు కానున్నాయి.
మీసేవలో సేవలు ఇవే..
మీసేవ కేంద్రాల్లో ప్రధానంగా కులం, ఆదాయం, నివాసం, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనన, మరణ ధ్రువీకరణ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, రేషన్‌కార్డులు, వ్యవసాయ భూమి విలువ, అగ్రికల్చర్ ఇన్‌కమ్ తదితర సర్టిఫికెట్లు కోసం ఎక్కువగా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటారు. అలాగే ఓపెన్ సైట్‌లో భాగంగా స్కాలర్‌షిప్‌లు, భూ భారతి, ఉద్యమం రిజిస్ట్రేషన్లు(సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం) దరఖాస్తు చేసుకుంటున్నారు. వాటితో పాటు గ్యాప్, రేషన్‌కార్డుల కరెక్షన్లు, ఇతరత్రా సవరణలు చేసుకోవడానికి దరఖాస్తు కేంద్రాల్లో చేసుకుంటున్నారు. వాటితో పాటు ఇటీవల డ్వాక్రా గ్రూపు రుణాల కోసం ఉద్యమం రిజిస్ట్రేషన్ తప్పనిసరి కావడంతో చేయించుకుంటున్నారు.
కేంద్రాల్లో దోపిడీ
రెండు నెలలుగా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తుదారులకు రశీదు ఇవ్వడం లేదు. ఈ స్లిప్ విధానం అమలు జరుగుతోంది. వారి సెల్ ఫోన్లకు మెసేజ్ వస్తుంది. దానిలోనే అన్ని వివరాలు వస్తాయి. ఇదిలా ఉండగా కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. కులం, ఆదాయం, నివాసం, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌కు రూ.80 తీసుకుకోవాలి. కానీ కొంత మంది నిర్వాహకులు రెట్టింపు తీసుకుంటే.. మరికొంత మంది అధికంగా వసూలు చేస్తున్నారు. ఇలా అన్ని సర్టిఫికెట్లపై అదనంగా వసూళ్లు చేస్తున్నారు. ఈ స్లిప్ విధానంతో దోపిడీ మరింత పెరిగింది. చదువు రాని వారు వస్తే వారి జేబులు ఖాళీ చేస్తున్నారు. వచ్చిన మెసేజ్‌లో అంత లేదు కదా అంటే ఇతరత్రా ఫీజులు ఉంటాయని చెప్పి దోచుకుంటున్నారు.
ఉద్యమం రిజిస్ట్రేషన్లతో
కాసుల వర్షం..
పరిశ్రమలశాఖ పరంగా తీసుకునే ప్రతీ రుణానికి ఉద్యమం రిజిస్ట్రేషన్ తప్పనిసరి అయింది. ఇటీవల డ్వాక్రా గ్రూపు రుణాల విషయంలో ఉద్యమం రిజిస్ట్రేషన్ తప్పనిసరి అయింది. దానికి రూ.110 తీసుకోవాలి. కానీ, రూ.400 నుంచి రూ.500 తీసుకుంటున్నారని డ్వాక్రా గ్రూపు సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పలు మీ సేవ కేంద్రాల్లో ఈ దోపిడీ మరి ఎక్కువగా ఉంది.
పర్యవేక్షణ లోపంతోనే..
సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కేంద్రాల్లో తనిఖీలు ఉంటే నిర్వాహకులు జాగ్రత్త పడే వారు. కానీ, తనిఖీలు లేకపోవడంతో అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రుసుము వసూలు ఇతర విషయాల్లో ఫిర్యాదు చేస్తే అధికారులు తనిఖీ చేసి విచారణ చేపట్టి మొదటి హెచ్చరికగా రూ.2,000 జరిమానా విధిస్తారు. రెండోసారి ఫిర్యాదు వస్తే విచారణలో నిజమని తేలితే హెచ్చరికగా రూ.5,000 జరిమనా విధిస్తారు. మూడో సారి కూడా కోద్ది రోజులు మాత్రమే షాపు సీజ్ చేసే అఽధికారం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈనిబంధనలతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు..
కేంద్రాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి. కమిషన్ కూడా ప్రభుత్వం భారీగా పెంచింది. అయినా అడ్డగోలుగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఫిర్యాదులు వస్తే జరిమానాలతో పాటు, చర్యలు తీసుకుంటాం.
– యుగేంధర్, ఈ డిస్ట్రిక్ మేనేజర్
దంతాలపల్లి
2
డోర్నకల్
7
గంగారం
2
గార్ల
4
గూడూరు
5
కేసముద్రం/ఇనుగుర్తి 9
కొత్తగూడ
4
కురవి/సీరోలు
8
మానుకోట
20
మరిపెడ
10
నర్సింహులపేట
5
నెల్లికుదురు
5
పెద్దవంగర
4
తొర్రూరు
7
అధికంగా వసూలు చేస్తున్న నిర్వాహకులు
కాసుల వర్షం కురిపిస్తున్న ఉద్యమం రిజిస్ట్రేషన్లు
నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణ
మండలాల వారీగా మీసేవ కేంద్రాలు


