మహబూబాబాద్ రూరల్: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిధి అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో మహిళా న్యాయవాది ఫిజాషా, న్యాయవాది షేక్.యాకూబ్ అకీబ్‌పై దుర్భాషలాడుతూ కొట్టడానికి వెళ్లిన పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిడాల సత్యనారాయణ అన్నారు. ఈమేరకు జిల్లా కోర్టు భవనాల సమదాయం ఎదుట న్యాయవాదులు శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యావాదులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ సంఘటనకు పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ కార్యదర్శి జనగాం సిద్ధార్థ, ఉపాధ్యక్షుడు ఉడుగుల హరికృష్ణ, స్పోర్ట్స్ సెక్రటరీ బుర్ర శ్రీనివాస్ గౌడ్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు యాదగిరి, శ్రీనివాస్, పుల్లూరు కృష్ణయ్య, చిలకమారి వెంకటేశ్వర్లు, పుల్లఖండం శ్రీనివాసస్వామి, కందునూరి వెంకటేశ్వర్లు, కటుకూరి శ్రీనివాస్, రాజమణి, సునీత, దేవి, సంద కృష్ణ, భూక్య మోహన్, వాసం ఆనంద్, పిన్ని రాము, సతీష్, సురేష్, వెంకటేష్ పాల్గొన్నారు.


