ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలి

Sep 26 2026 1:20 AM | Updated on Sep 26 2026 1:20 AM

మహబూబాబాద్‌ రూరల్‌: ఎల్‌నినో నేపథ్యంలో యాసంగిలో మొక్కజొన్న, పెసర, మినుములు, కూరగాయల పంటల సాగును ఎక్కువగా ప్రోత్సహించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్‌.విజయచంద్ర అన్నారు. యాసంగి పంటల ప్రణాళికపై జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏఓ విజయచంద్ర మాట్లాడుతూ.. రాబోయే యాసంగిలో సాగు చేయాల్సిన పంటలు, పంటల వైవిధ్యం, పంట మార్పిడి, ఉద్యాన పంటలు, పశుగ్రాసం, విత్తనాలు, ఎరువుల లభ్యత అంశాలపై చర్చించారు. యాసంగిలో మొక్కజొన్న, పెసర, మినుములు, కూరగాయలు పంటలను ఎక్కువగా ప్రోత్సహించాలని నిర్ణయించారు. వరి పంటలో నేరుగా విత్తనాలు విత్తే విధానంపై రైతులకు అవగాహన కల్పించాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రకృతి వ్యవసాయం, ఆత్మ నిర్భరత పథకాలను అమలు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో జిల్లా ఉద్యాన, జిల్లా పశుసంవర్థక, జిల్లా సహకార శాఖల అధికారులు మరియన్న, కిరణ్‌ కుమార్‌, సర్దార్‌ సింగ్‌, మల్యాల కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ దిలీప్‌ కుమార్‌, జేవీఆర్‌ హెచ్‌ఆర్‌ఎస్‌ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ప్రశాంత్‌ కుమార్‌, ఏడీఏలు మురళి, శ్రీనివాసరావు, టెక్నికల్‌ ఏఓలు జావీద్‌, కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫార్మర్‌ రిజిస్ట్రీతో ప్రయోజనం

డోర్నకల్‌: ఫార్మర్‌ రిజిస్ట్రీతో రైతులకు అన్ని విధాలుగా ప్రయోజనం చేకూరుతుందని జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర తెలిపారు. మండలంలోని ముల్కలపల్లి, పెరుమాళ్లసంకీస గ్రామాల్లో శుక్రవారం ఫార్మర్‌ రిజిస్ట్రీ ప్రక్రియను పరిశీలించి రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అనిల్‌కుమార్‌, ఏఈఓ అవినాష్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వ్యవసాయ అధికారి ఎస్‌.విజయచంద్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement