చదువుకుంటేనే సమాజంలో ఉన్నతస్థానం | - | Sakshi
Sakshi News home page

చదువుకుంటేనే సమాజంలో ఉన్నతస్థానం

Sep 26 2026 1:20 AM | Updated on Sep 26 2026 1:20 AM

● కలెక్టర్‌ స్నేహశబరీష్‌

గూడూరు: చదువుకున్న వారికి సమాజంలో ఉన్నత స్థానం, గౌరవం లభిస్తుందని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ అన్నారు. మండలంలోని మట్టెవాడ గిరిజన బాలుర ఆశ్రమోన్నత పాఠశాలను శుక్రవారం కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాబోధన, డైట్‌ మెనూ, యూనిఫామ్‌, పాఠ్యపుస్తకాలు వచ్చాయా అని అడిగి తెలుసుకున్నారు. పిల్లలతో మాట్లాడుతూ వారి విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. నాణ్యమైన, రుచికరమైన భోజనం వడ్డించాలన్నారు. క్రమం తప్పకుండా భోజనం తయారీ చేసే వర్కర్లకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఉపాధ్యాయులు కర్తవ్యదీక్షతో విధులు నిర్వర్తించాలని, విద్యార్థులు వందశాతం హాజరయ్యేలా చూడాలన్నారు. ఇంగ్లిష్‌ బోధనపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అహారం, వసతి సౌకర్యాలపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారి దేశీరాంనాయక్‌, తహసీల్దార్‌ నాగభవాని పాల్గొన్నారు.

ఓటర్ల నమోదు పక్కాగా జరగాలి

ఇనుగుర్తి: కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన షెడ్యూల్‌ ప్రకారం ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, కొత్త ఓటర్ల నమోదును పక్కాగా నిర్వహించాలని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ ఆదేశించారు. మండలంలోని చిన్నముప్పారం గ్రామంలో కలెక్టర్‌ స్నేహా శబరీష్‌ శుక్రవారం విస్తృతంగా పర్యటించి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, ప్రత్యేక హియరింగ్స్‌, భూముల రీ–సర్వే పనుల పురోగతిపై తహసీల్దార్‌ సుంకరి శ్రీనివాసులును అడిగి తెలుసుకున్నారు. గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూములు, ఆబాది (నివాస స్థలాలు), పట్టా భూముల రీ–సర్వే ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పక్కాగా పూర్తి చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పార్థసారథి, సర్పంచ్‌ రాయిలి భవాని, రెవెన్యూ సిబ్బంది, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement