అనుమతులు మంజూరు చేయాలి | - | Sakshi
Sakshi News home page

అనుమతులు మంజూరు చేయాలి

Sep 25 2026 1:35 AM | Updated on Sep 25 2026 1:35 AM

మహబూబాబాద్‌: ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో జిల్లాస్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధిలో భాగంగా రో డ్లు, పాఠశాలల భవన నిర్మాణాలు, వీబీజీరామ్‌జీ పథకం ద్వారా జరిగే తదితర పనులకు పరిపాలన అనుమతులు ఇవ్వాలన్నారు. జిల్లాలో అటవీ భూ ముల రక్షణ, వన్యప్రాణాల సంరక్షణ తదితర కార్యక్రమాల అమలులో ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దన్నారు. జిల్లాలోని అటవీ భూముల సరిహద్దులను రెవెన్యూ, అటవీ శాఖలు సంయుక్తంగా సర్వే చేసి గుర్తించాలన్నారు. ఆక్రమణలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. మరికొన్ని చెక్‌పోస్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. వన్యప్రాణుల వేటను అరికట్టేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ నితీష్‌, డీఎఫ్‌ఓ లావణ్య, ఆర్డీఓలు రాజేశ్వరి, గణేశ్‌ పాల్గొన్నారు.

పోస్టర్‌ ఆవిష్కరణ..

అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వయోవృద్దుల సంక్షేమం, సాధికారత వారోత్సవాల ప్రచార పోస్టర్లను కలెక్టర్‌ స్నేహశబరీష్‌ ఆవిష్కరించారు.

కలెక్టర్‌ స్నేహశబరీష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement