బతుకమ్మ చీరలొచ్చాయ్‌.. | - | Sakshi
Sakshi News home page

బతుకమ్మ చీరలొచ్చాయ్‌..

Sep 25 2026 1:35 AM | Updated on Sep 25 2026 1:35 AM

వచ్చే నెల మొదటి వారంలో అందజేస్తాం

మండలాల వారీగా మహిళల వివరాలు

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లాకు బతుకమ్మ(ఇందిరమ్మ) చీరలు చేరుకున్నాయి. రేషన్‌ కార్డు కలిగిన 18ఏళ్ల పైబడిన మహిళల జాబితా సిద్ధం చేశారు. జిల్లాలో 1,61,389 మంది మహిళలు ఉన్నారు. వారందరికీ చీరలను పంపిణీ చేయనున్నారు. కాగా, మానుకోటలో 40వేలు, తొర్రూరులో 40వేల చీరలను వ్యవసాయ గోదాంలలో భద్రపరిచారు. వాటిని డోర్నకల్‌, కేసముద్రం, మరిపెడ, తొర్రూరు, మానుకోట మండలాలతో పాటు ఐదు మున్సిపాలిటీలకు అధికారులు తరలించనున్నారు. మిగిలిన చీరలు సరఫరా కాగానే ఇతర మండలాలకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

అర్హులందరికీ పంపిణీ చేసేలా..

రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను పురస్కరించుకుని జిల్లాలో 18ఏళ్లు నిండిన యువతుల నుంచి వృద్ధ మహిళల వరకు అందరికీ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మొదటి విడతగా జిల్లాకు వచ్చిన 80వేల చీరలను అధికారుల పర్యవేక్షణలో జిల్లాలోని మానుకోట, తొర్రూరు గోదాంలలో భద్రపరిచారు. జిల్లాలో 18 మండలాల్లో 558 రేషన్‌ దుకాణాలు ఉండగా, వాటి పరిధిలో 2,79,089 ఆహార భద్రత కార్డులు కలిగిన కుటుంబాలు ఉన్నాయి. ఈ కార్డుల్లో 18 సంవత్సరాలు నిండిన యువతులు, మహిళలు 1,61,389మంది ఉన్నట్లు గుర్తించారు. వచ్చిన చీరలను బతుకమ్మ పండగ ప్రారంభానికి ముందే ఆడపడుచులకు పంపిణీ చేసేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

అక్టోబర్‌ మొదటి వారంలో పంపిణీ..

అక్టోబర్‌ మొదటివారంలో నియోజకవర్గస్థాయిలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఆధ్వర్యంలో లబ్ధ్దిదారులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు.

ప్రభుత్వం నుంచి వచ్చిన బతుకమ్మ చీరలను గోదాంల్లో భద్రపరుస్తున్నాం. ఈనెలాఖరులో అన్ని మండల కేంద్రాలకు పంపిస్తాం. మొదట స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరలు అందజేస్తాం. ఆ తర్వాత 18 సంవత్సరాలు నిండిన యువతులకు, మహిళలకు రేషన్‌కార్డ్‌, ఆధార్‌ కార్డు ఆధారంగా అక్టోబర్‌ మొదటి వారంలోనే చీరల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం.

– మధుసూదన్‌రాజు, డీఆర్‌డీఓ

మండలం మహిళలు

బయ్యారం 11,963

చిన్నగూడూరు 3,979

దంతాలపల్లి 7,910

డోర్నకల్‌ 9,861

గంగారం 3,150

గార్ల 9,067

గూడూరు 16,127

కేసముద్రం 12,885

కొత్తగూడ 7,451

కురవి 16,125

మహబూబాబాద్‌ 10,693

మరిపెడ 12,970

నర్సింహులపేట 7,099

నెల్లికుదురు 12,766

పెద్దవంగర 7,288

తొర్రూరు 12,055

మొత్తం 1,61,389

తొర్రూరు, మానుకోటకు చేరిన

ఇందిరమ్మ చీరలు

ప్రస్తుతం 80వేల చీరలు రాక

జిల్లాలో 1,61,389మంది మహిళలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement