నేడు మంత్రి సీతక్క సమీక్ష | - | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి సీతక్క సమీక్ష

Sep 25 2026 1:35 AM | Updated on Sep 25 2026 1:35 AM

హన్మకొండ అర్బన్‌: ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై రాష్ట్ర మంత్రి సీతక్క శుక్రవారం సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు హనుమకొండ ఐఓడీసీలో జరగనున్న ఈ సమావేశంలో ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు గ్రామస్థాయిలో చేపట్టాల్సిన నివారణ, ముందస్తు చర్యలు, కార్యాచరణ ప్రణాళికపై సమీక్షించనున్నారు. గ్రామ పంచాయతీ, వీఓ, అంగన్‌వాడీ, ఇతర భవనాల నిర్మాణ పనుల పురోగతి, పూర్తి స్థితి, పెండింగ్‌ పనులను పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అధికారులు తమ శాఖల తాజా గణాంకాలు, పురోగతి నివేదికలు, పెండింగ్‌ పనుల వివరాలు, వాటిని పూర్తి చేసేందుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికతో సమావేశానికి హాజరు కావాలని స్పెషల్‌ సీఎస్‌ దాన కిశోర్‌ ఆదేశించారు.

సమన్వయంతో పనిచేయాలి

మహబూబాబాద్‌ : రెవెన్యూ, అటవీ భూ సమస్యల పరిష్కారం కోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ భూక్య మురళీనాయక్‌ అన్నారు. కలెక్టరేట్‌లో మానుకోట నియోజకవర్గ భూ సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ సమస్యలను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలన్నారు. ప్రతీ నెల సమన్వయ సమావేశం నిర్వహించాలన్నారు. సమావేశంలో కలెక్టర్‌ స్నేహశబరీష్‌, అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌, డీఎఫ్‌ఓ లావణ్య, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

జాగ్రత్తలు పాటించాలి

నెహ్రూసెంటర్‌: భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా వినియోగదారులు జాగ్రత్తలు పాటించాలని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ దర్శన్‌కుమార్‌ గురువారం తెలిపారు. మూడురోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో విద్యుత్‌శాఖ అప్రమత్తమై ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. విద్యుత్‌ సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడూ విద్యుత్‌ సరఫరా స్థితిని పరిశీలించాని సూచించారు. విద్యుత్‌ సంబంధిత సమస్యలు ఎదురైతే వెంటనే కంట్రోల్‌ రూం నంబర్‌ 87124 81550 లేదా టోల్‌ ప్రీ నంబర్‌ 1912ను సంప్రదించాలని తెలిపారు.

కవి సమ్మేళనం

విజయవంతం చేయాలి

మహబూబాబాద్‌/నెహ్రూసెంటర్‌: అభ్యుదయ రచయితల సంఘం(అరసం) ఆధ్వర్యంలో ఈనెల 27న జిల్లా కేంద్రంలోని లయన్స్‌ క్లబ్‌ భవనంలో జరిగే కవి సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని సంఘం జిల్లా నిర్మాణ బాధ్యుడు కొంపెల్లి రామయ్య పిలుపునిచ్చారు. స్థాక లయన్స్‌ క్లబ్‌ భవనంలో గురువారం అరసం జిల్లా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రామయ్య మాట్లాడుతూ.. అభ్యుదయ, సామాజిక భావజాలం ఉన్న రచయితలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. 70325 04646 నంబర్‌కు ఫోన్‌ చేసి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ మున్సిపల్‌ఫ్లోర్‌ లీడర్‌ అజయ్‌సారథిరెడ్డి, అరసం బాధ్యులు రమేశ్‌, పాండు రంగాచారి, వెంకటేశ్వర్లు, ప్రసాద్‌, సత్యనారాయణ, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement