నిబంధనల ప్రకారం ఆస్పత్రులు నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

నిబంధనల ప్రకారం ఆస్పత్రులు నిర్వహించాలి

Sep 25 2026 1:35 AM | Updated on Sep 25 2026 1:35 AM

నెహ్రూసెంటర్‌: ప్రైవేట్‌ ఆస్పత్రులు, ల్యాబ్‌ నిర్వాహకులు నిబంధనలు పాటిస్తూ నిర్వహణ చేపట్టాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్‌ సూచించారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రులను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం నిబంధనలు తప్పకుండా పాటించాలని తెలిపారు. ఆస్పత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ, బయో మెడికల్‌ వెస్టేజ్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ సంబంధిత పత్రాలను కలిగి ఉండాలన్నారు. ఆస్పత్రి చార్జీల వివరాలు, సిబ్బంది, వైద్యుల వివరాలను ఆస్పత్రి రికార్డులను పరిశీలించారు. రిజిస్ట్రేషన్‌ అనుమతులు లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తే సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీలో డాక్టర్‌ విరాజిత, డెమో రాజ్‌కుమార్‌, అనిల్‌కుమార్‌, ప్రశాంత్‌, సత్య పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement