రాయపర్తి: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన బందోబస్తుకు వెళ్లి హిట్ అండ్ రన్‌లో దుర్మరణం చెందిన ఎస్సై కునుసోతు వెంకన్న(57) అంత్యక్రియలు గురువారం అధికార లాంఛనాలతో తన సొంత గ్రామం రాయపర్తి మండలం కిష్టాపురంలో నిర్వహించారు. గ్రామస్తులు, పోలీసులు పెద్దఎత్తున తరలివచ్చారు. గ్రామవీధులగుండా అంతిమయాత్ర నిర్వహించి పోలీసు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య హచ్చమ్మ, ఓ కుమార్తె ప్రియాంక, కుమారుడు జితేందర్ ఉన్నారు. గ్రామానికి చెందిన ఎస్సై వెంకన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో విధులు నిర్వర్తిస్తుండగా ఇటీవల మహబూబా బాద్‌కు బదిలీ అయింది. ఈ క్రమంలో హైదరాబా ద్‌లో బుధవారం గణేశ్ నిమజ్జన బందోబస్తుకు వెళ్లగా ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా, ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనదారుడి కోసం సైఫాబాద్ పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.
కిష్టాపురంలో తీవ్ర విషాదఛాయలు


