వరంగల్‌ మీదుగా ప్రత్యేక రైళ్లు | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌ మీదుగా ప్రత్యేక రైళ్లు

Sep 25 2026 1:35 AM | Updated on Sep 25 2026 1:35 AM

కాజీపేట రూరల్‌ : ప్రయాణికుల సౌకర్యార్థం వరంగల్‌ మీదుగా పొదనూర్‌–బరౌని –పొదనూర్‌ మధ్య పది ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం తెలిపారు. ఈ రైళ్లను అక్టోబర్‌ 4 నుంచి నవంబర్‌ 29వ తేదీ వరకు నడిపించనున్నట్లు పేర్కొన్నారు.

ప్రత్యేక రైళ్ల వివరాలు..

అక్టోబర్‌ 4 నుంచి నవంబర్‌ 1వ తేదీ వరకు ప్రయాణించే 5 రైళ్లు పొదనూర్‌–బరౌని (06021) ఎక్స్‌ప్రెస్‌గా ప్రతీ ఆదివారం పొదనూర్‌లో బయలుదేరి మరుసటి రోజు వరంగల్‌కు చేరుకుంటుంది. అక్టోబర్‌ 7 నుంచి నవంబర్‌ 4వ తేదీ వరకు ప్రయాణించే 5 రైళ్లు బరౌని–పొదనూర్‌ (06022) ఎక్స్‌ప్రెస్‌గా బరౌనిలో ప్రతీ బుధవారం బయలుదేరి మరుసటి రోజు వరంగల్‌కు చేరుకుంటుంది. ఈ రైళ్లకు అప్‌ అండ్‌ డౌన్‌లో తిరుపూర్‌, ఈరోడ్‌, సేలం, జోలర్‌పేటయ్‌, కట్‌పాడి, పెరంబూర్‌, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్‌, సిర్పూర్‌కాగజ్‌నగర్‌, బల్లార్షా, చంద్రాపూర్‌, నాగ్‌పూర్‌, బెతుల్‌, ఇటార్సీ, పిపరియా, గద్వారా, జబల్‌పూర్‌, కట్నీ, మహీర్‌, సంత, మాణిక్‌పూర్‌, ప్రయాగ్‌రాజ్‌, చౌఖీ, చూనార్‌, పండిట్‌ దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ, బాక్సర్‌, ఆరా, దానాపూర్‌, పాటలీపుత్ర, సోనాపూర్‌, హజ్‌పూర్‌, షాపూర్‌లో హాల్టింగ్‌ కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement