హన్మకొండ అర్బన్ : హనుమకొండ ప్రభుత్వ బాలికల సదనంలోని బాలికను గురువారం దత్త త ప్రాధికార సంస్థ ఆదేశాల మేర కు నల్లగొండ జిల్లాకు చెందిన దంపతులకు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తన చాంబర్‌లో దత్తత ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ దత్తత తీసుకున్న తల్లిదండ్రులు బాలికను బాగా చ దివించి, భవిష్యత్తులో ఉన్నతంగా ఎదిగేలా చూడాలని కో రారు. జిల్లా సంక్షేమాధికారి ఎం.విశ్వజ, బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ సీహెచ్. అవంతి, ప్రభుత్వ బాలికల సదనం సూపరింటెండెంట్ ఎం.కల్యాణి, ఇన్‌చార్జి డీసీపీఓ ఎస్. ప్రవీణ్‌కుమార్, సోషల్ వర్కర్ సంగి చైతన్య పాల్గొన్నారు.


