ట్రాన్స్‌కో కన్‌స్ట్రక్షన్‌ డీఈ సంపతిరావు సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌కో కన్‌స్ట్రక్షన్‌ డీఈ సంపతిరావు సస్పెన్షన్‌

Sep 25 2026 1:35 AM | Updated on Sep 25 2026 1:35 AM

హన్మకొండ: టీజీ ట్రాన్స్‌ కో వరంగల్‌ జోన్‌ కన్‌స్ట్రక్షన్‌ డీఈ ఎల్‌.సంపతిరావుపై యాజమాన్యం సస్పెన్షన్‌ వేటు వేసింది. వరంగల్‌ జోన్‌ కార్యాలయంలో చీఫ్‌ ఇంజనీర్‌పై దౌర్జన్యం, దాడి, బెదిరించిన ఘటనలో ఎల్‌.సంపతి రావును సస్పెండ్‌ చేస్తూ టీజీ ట్రాన్స్‌ కో ఫైనాన్స్‌ కమర్షియల్‌, హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌లు ఓరుగంటి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్‌ కో వరంగల్‌ కార్యాలయంలో ఇన్‌చార్జ్‌ బాధ్యతలపై ఈ నెల 18వ తేదీన ఎల్‌.సంపతిరావు బయటి వ్యక్తులను తీసుకొచ్చి దాడి, దౌర్జన్యం చేయడం, బెదిరించడంపై విజిలెన్స్‌ అధికారులు విచారణ జరిపి నివేదిక సమర్పించారు. దీంతో క్రమశిక్షణ చర్య ల కింద సంపతిరావును సస్పెండ్‌ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సస్పెన్షన్‌ ఉత్తర్వులు అమలులో ఉన్నంత కాలం అనుమతి లేకుండా హెడ్‌ క్వార్టర్‌ విడిచి వెళ్లొద్దని ఆదేశించారు.

మృతురాలి వివరాలు గుర్తింపు

స్టేషన్‌ఘన్‌పూర్‌ : కాజీపేట నుంచి సికింద్రాబాద్‌ వైపున వెళ్తున్న వందేభారత్‌ రైలు కింద పడి ఘన్‌పూర్‌–నష్కల్‌ రైల్వేస్టేషన్ల మధ్య ఆత్మహత్యకు పాల్పడిన యువతిని జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం రంగరాయగూడెం గ్రామానికి చెందిన గుండె మానస (20)గా గుర్తించారు. కాజీపేట జీఆర్‌ పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుండె రాంచంద్రు, మంజుల దంపతుల కుమార్తె మానస ఇంట్లో జరిగిన గొడవలతో మనస్తాపానికి గురై ఈ నెల 20వ తేదీన ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు జీఆర్‌ పోలీసులు తెలిపారు.

కుటుంబ కలహాలతో

యువకుడి ఆత్మహత్య

● హైదరాబాద్‌లో ఘటన.. మృతుడు

మల్కాపూర్‌ వాసి

చిల్పూరు: కుటుంబ కలహాలతో జనగామ జిల్లా చిల్పూరు మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన పుల్యాల మణికంఠరెడ్డి ((37) హైదరాబాద్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన రాంరెడ్డి, పుష్ప దంపతుల కుమారుడు మణికంఠ తండ్రి మృతి చెందిన అనంతరం హైదరాబాద్‌లోని ఇస్నాపూర్‌లో ఉంటున్నాడు. కొద్ది రోజులుగా భార్యతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా జరగగా క్షణికావేశంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు కేసు నమోదు చేశా రు. మణికంఠరెడ్డి అంత్యక్రియలు గురువారం స్వగ్రామం మల్కాపూర్‌లో నిర్వహించారు.

కులం పేరుతో

దూషించారని..

● వృద్ధురాలి ఆత్మహత్య

గూడూరు: దారి వివాదంలో కులం పేరుతో దూషించారని మనస్తాపం చెందిన ఓ వృద్ధురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కథనం ప్రకారం.. మండలంలోని భూపతిపేటకు చెందిన తేజావత్‌ ద్వాలి (69) తన 12 అడుగుల వెడల్పు గల భూమిని 2022లో జక్కుల ముణేశ్‌ అనే వ్యక్తికి విక్రయించారు. కాగా, ఆ దారి విషయంలో ఇరువురి మధ్య కొద్దికాలంగా వివాదం జరుగుతోంది. ఈ క్రమంలో బుధవారం కూడా ఇదే విషయంపై ఇరువురికి వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో ముణేశ్‌ కుటుంబీకురాలు రజిత.. ద్వాలిని కులం పేరుతో దూషించి, అసభ్యకర పదజాలంతో దూర్భాషలాడింది. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన ద్వాలి వెంటనే ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి పడిపోయింది. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే నర్సంపేట ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి వరంగల్‌ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి మనవడు రంజిత్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్సై సి. హెచ్‌. రమేశ్‌బాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement