యువశక్తి నాయకత్వ వికాసంలో ఎన్‌ఎస్‌ఎస్‌ కీలకం | - | Sakshi
Sakshi News home page

యువశక్తి నాయకత్వ వికాసంలో ఎన్‌ఎస్‌ఎస్‌ కీలకం

Sep 25 2026 1:35 AM | Updated on Sep 25 2026 1:35 AM

కేయూ క్యాంపస్‌ : యువశక్తి నాయకత్వ వికాసంలో జాతీయ సేవాపథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) కీలకపాత్ర పోషిస్తుందని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం కేయూ ఎన్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం క్యాంపస్‌లోని ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. వీసీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సామాజిక సేవా, పర్యావరణ పరిరక్షణ, యువత నాయకత్వ వికాసంలో విశిష్టసేవలు అందిస్తూ కేయూ ఎన్‌ఎస్‌ఎస్‌ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందన్నారు. యూనివర్సిటీ పరిధిలో 356 ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్లతో 35,600 మంది వలంటీర్లు తమ సేవలు అందిస్తూ రాష్ట్రస్థాయిలో కూడా కేయూ ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రథమ స్థానంలో ఉందన్నారు. దేశాభివృద్ధిలో వికసిత్‌భారత్‌, రైజింగ్‌ తెలంగాణ అభివృద్ధిలో యువతశక్తి భాగస్వామ్యమే కీలకమన్నారు. తెలుగు అకాడమీ చైర్మన్‌, కేయూ ఎన్‌ఎస్‌ఎస్‌ పూర్వ కోఆర్డినేటర్‌ కె. వెంకటనారాయణ మాట్లాడుతూ లక్షల మంది భక్తులు పాల్గొనే మేడారం జాతరలోనూ ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు తమ సేవలను అందిస్తున్నారన్నారు. 50 వసంతాల్లో ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు అద్భుత సేవలు అందించారని పేర్కొన్నారు. మహబూబాబాద్‌ మాజీ ఎంపీ, ఎన్‌ఎస్‌ఎస్‌ పూర్వపు కోఆర్డినేటర్‌ అజ్మీరా సీతారాంనా యక్‌ మాట్లాడుతూ యువతను తీర్చిదిద్దే ఉద్యమ మే ఎన్‌ఎస్‌ఎస్‌ అన్నారు. కేయూలో ఇంకా ఎన్‌ఎస్‌ ఎస్‌ సేవల విస్తృతికి క్యాంపస్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ భవన నిర్మాణానికి తనవంతుగా కృషిచేస్తానని, అందుకు కొంత స్థలం కూడా కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. కేయూ రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం, ఎ న్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ ఈసం నారాయణ, యూని వర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌ టి.మనోహర్‌, కేయూ పూర్వ ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్లు ఎం. కిష్టయ్య, జి. బాలస్వామి, ఆర్ట్స్‌అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌. జ్యోతి, కేయూ పాలకమండలి సభ్యులు బి. సురేశ్‌లాల్‌, చిర్రరాజు, కేయూ ఇంజనీరింగ్‌ కళా శాల ప్రిన్సిపాల్‌ ఎన్‌. రమణ పాల్గొన్నారు.

ఆవిర్భావ దినోత్సవంలో

కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement