ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా హేమాచల క్షేత్రం | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా హేమాచల క్షేత్రం

Sep 25 2026 1:35 AM | Updated on Sep 25 2026 1:35 AM

● రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క

మంగపేట : మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి దేవస్థానాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా సకల సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల క్షేత్రాన్ని కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహాదేవరావు, అటవీశాఖ అధికారి వికాస్‌ మీనాతో కలిసి గురువారం సందర్శించి స్వయం భూ లక్ష్మీనర్సింహాస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధిలో భాగంగా చేపట్టాల్సిన వివిధ పనులు, ఆలయ ముఖ మండపం నిర్మాణ మాస్టర్‌ ప్లాన్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భగా మంత్రి మాట్లాడుతూ ఏటా భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతుందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆలయ ముఖ మండప నిర్మాణానికి రూ. 3 కోట్లు మంజూరయ్యాయన్నారు. ప్రాంగణంలో కల్యాణ మండపం, భక్తులకు కాటేజీ, నిత్య అన్నదాన నిర్వహణకు డార్మెటరీ నిర్మాణం, సెంట్రల్‌ స్టోర్‌, రోడ్లు తదితర అభివృద్ధి పనులతో పాటు సహజ సిద్ధ కోనేరు, చింతామణి జలపాతం తదితర అభివృద్ధి పనుల కోసం రూ. 30 కోట్లతో అంచనా వేశామన్నారు. అభివృద్ధి పనుల్లో ఆలయ పరిసరాల్లోని సహజత్వానికి ఎలాంటి విఘాతం కలగకుండా చేపట్టాలని సూచించారు. సమావేశానికి ముందు ఆల య గోశాల నిర్మాణ పనులకు మంత్రి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు) సంపత్‌రావు, డీపీఓ కొండ వెంకయ్య, ములుగు మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగ కల్యాణి, టీఎస్‌ఈజీ సభ్యుడు గుమ్మడి సోమయ్య, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, హేమాచలక్షేత్రం మాజీ చైర్మన్‌ సురేశ్‌, జిల్లా నాయకులు కర్రి నాగేంద్రబాబు, వల్లెపల్లి శివప్రసాద్‌, మైల జయరాంరెడ్డి, ఇర్సవడ్ల వెంకటేశ్వర్లు, ఇస్సార్‌ఖాన్‌, కొడం బాలకృష్ణ, సి.హెచ్‌ శ్రీనివాస్‌, పచ్చా శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement