రోడ్డు ప్రమాదంలో మరో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మరో యువకుడి మృతి

Sep 25 2026 1:35 AM | Updated on Sep 25 2026 1:35 AM

● వివరాలు వెల్లడించిన పోలీసులు

మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌ మున్సిపాలిటీ పరిధి ఈదులపూసపల్లి రోడ్డులోని బీజేపీ కార్యాలయ సమీపంలో ఈనెల 22వ తేదీ (మంగళవారం) రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో మరో యువకుడు చెందినట్లు గుర్తించామని రూరల్‌ ఎస్సై పి.రాజు గురువారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన పొన్నాల వెంకన్న బైక్‌పై మంగళవారం సాయంత్రం ఈదులపూసపల్లిలోని తన బంధువు నాగేల్లి ప్రేమ్‌ ఇంటికి వచ్చాడు. అదే రోజు రాత్రి వెంకన్న, ప్రేమ్‌ ఇద్దరు కలిసి తమ బైక్‌పై మహబూబాబాద్‌కు వచ్చారు. అనంతరం తిరిగి ఇంటికి వెళ్తుండగా అదే వాహనంపై ఈదులపూసపల్లికి చెందిన దుంపటి జంపులు అలియాస్‌ జంపయ్య (36) వారితో కలిసి వెళ్లాడు. బీజేపీ జిల్లా కార్యాలయ సమీపంలో కారు.. బైక్‌ను ఢీకొన్న సందర్భంలో వెంకన్న మృతిచెందగా జంపులు ఆచూకీ తెలియలేదు. బుధవారం సాయంత్రం అతడి మృతదేహం ఘటనా స్థలికి కొంతదూరంలో కనిపించగా కుటుంబ సభ్యులు, స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై జంపులు తండ్రి దర్గయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

విద్యుదాఘాతంతో గొల్లపల్లిలో వ్యక్తి..

గణపురం: చెట్టు కొమ్మలు నరికే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌ తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గొల్లపల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దాసరి రాజు(40) ఇంటి ముందు ఉన్న చెట్టు కొమ్మలు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తన గృహంపై పడ్డాయి. దీంతో రాజు కొమ్మలు నరికే క్రమంలో సమీపంలోని 11 కేవీ విద్యుత్‌ తగిలి షాక్‌కు గురై చెట్టు పైనే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భూపాలపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement