సీఈసీని వెంటనే అరెస్ట్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

సీఈసీని వెంటనే అరెస్ట్‌ చేయాలి

Sep 25 2026 1:35 AM | Updated on Sep 25 2026 1:35 AM

జనగామ రూరల్‌ : ఈసీని బీజేపీ ఏజెంట్‌ సంస్థగా మార్చిన చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. యువజన కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు ఉదయభాను చిబ్‌ ఆదేశాల మేరకు గురువారం జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శివచరణ్‌ రెడ్డి, రాష్ట్ర సహాయ ఇన్‌చార్జ్‌ కె.ఆర్‌. భవ్య మాట్లాడుతూ ఎలక్షన్‌ కమిషన్‌ పేరుతో దాదాపు దేశవ్యాప్తంగా 13 కోట్లకు పైగా ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్‌ ఓటరు జాబితా నుంచి తొలగించి బీజేపీ గెలుపునకు పరోక్షంగా సహకరిస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్‌ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా జ్ఞానేష్‌ కుమార్‌ బీజేపీ ఏజెంట్‌గా మారి ఓట్లను తొలగిస్తూ లబ్ధి చేకూరుస్తున్నారని మండిపడ్డారు. యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు క్రాంతి కుమార్‌, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అల్వాల కార్తీక్‌, చంద్రిక గౌడ్‌, ఉపాధ్యక్షులు కమలాకర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శులు మహేశ్‌, బాబా, సంపత్‌, నియోజకవర్గాల అధ్యక్షులు రాజేశ్‌ నాయక్‌, సంతోష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా

పనిచేయాలి

వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ, మహబూబ్‌నగర్‌– హైదరాబాద్‌–రంగారెడ్డి గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌ రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలో యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు క్రాంతి కుమార్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసి సమావేశంలో శివచరణ్‌ రెడ్డి మాట్లాడారు.

యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు

శివచరణ్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement