మహబూబాబాద్ అర్బన్ : కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం నెల రోజుల సేవా సంకల్ప అభియాన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్యాంసుదర్‌శర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటీ మహేష్‌గౌడ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మహేష్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శులు భరత్, రమేష్, రిషి, నాయకులు లోకేష్, చంద్రశేఖర్, నాగరాజు, శ్రీకాంత్, చంటి తదితరులు పాల్గొన్నారు.


