15రోజులుగా తాగునీటి సరఫరా బంద్‌ | - | Sakshi
Sakshi News home page

15రోజులుగా తాగునీటి సరఫరా బంద్‌

Sep 16 2026 4:13 AM | Updated on Sep 16 2026 4:13 AM

గార్ల: గార్ల పట్టణంలో 15 రోజుల నుండి తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా నాయకుడు శ్రీనివాసరావు మాట్లాడారు. ఇల్లెందు సమీపంలో మిషన్‌ భగీరథ పైపులైన్‌ లీక్‌ కావడంతో గార్ల పట్టణంలో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గార్ల పట్టణంలో వారంరోజుల క్రితం తాగునీటి సమస్య తీర్చాలని గ్రామసభలో ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టగా, సమస్య తీర్చుతామని హామీ ఇచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులు నేటికీ పట్టించుకోకపోవడం శోచనీయం అన్నారు. ఐద్వా, డీవైఎఫ్‌ఐ, సీఐటీయూ తదితర ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు. నాయకులు అంబటి వీరస్వామి, రామకృష్ణ, మౌనిక, కొండయ్య, ఐల య్య, సతీష్‌, నాగరాజు, అచ్చయ్య, వార్డుసభ్యుడు పూర్ణచందర్‌రావు, సాయి పాల్గొన్నారు.

ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement