కొలువుదీరిన లంబోదరుడు.. | - | Sakshi
Sakshi News home page

కొలువుదీరిన లంబోదరుడు..

Sep 16 2026 4:13 AM | Updated on Sep 16 2026 4:13 AM

మహబూబాబాద్‌ రూరల్‌: మహాగణపతి నవరాత్రి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు భక్తిశ్రద్ధలతో మండపాల వద్ద పూజలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో నిర్వాహకులు భక్తులను ఆకట్టుకునే విధంగా మండపాల సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో శ్రీమహాలక్ష్మి గణపతి సేవా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో గోమయ గణపతిని కొలువుదీర్చారు. అదే విధంగా జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలతో పాటు పలు గ్రామాల్లో కూడా మట్టిగణపతి విగ్రహాలు ఏర్పాటు చేశారు. మహేశ్వరి భవన్‌లో రంగు రంగుల మట్టి గణపయ్యను ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎస్పీ శబరీష్‌ ఆదేశాల మేరకు డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణకిశోర్‌ ఆధ్వర్యంలో విస్తృత పోలీసు బందోబస్తు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. వినాయక విగ్రహాలను పోలీసు అధికారులు జియో ట్యాగింగ్‌ చేశారు.

వైభవంగా గణపతి నవరాత్రులు ప్రారంభం

విస్తృత పోలీసు బందోబస్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement