19న మరిపెడలో కోర్టు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

19న మరిపెడలో కోర్టు ప్రారంభం

Sep 16 2026 4:13 AM | Updated on Sep 16 2026 4:13 AM

మరిపెడ రూరల్‌: మరిపెడలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్‌ సివిల్‌ కోర్టును ఈ నెల 19న ప్రారంభించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, మహబూబాబాద్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి స్వాతి మురారి తెలిపారు. మంగళవారం మరిపెడ ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో కోర్టు ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు, న్యాయవాదులతో ఆమె చర్చించారు. అనంతరం నూతన కోర్టు భవనం, పరిసరాలను పరిశీలించి ఏర్పాట్లపై సమీక్షించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కృష్ణవేణి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ప్రగతి శ్రీపాల్‌రెడ్డి, జిల్లా బార్‌ అసోసియేషన అధ్యక్షుడు మామిడాల సత్యనారాయణ, కార్యదర్శి సిద్ధార్థ, న్యాయవాదులు తొనుకునూరి సైదులు, శ్రీనివాస్‌, మరిపెడ సీఐ పవన్‌కుమార్‌, ఎస్సైలు గండ్రాతి సతీష్‌, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భవిత సెంటర్‌లో నమోదు చేయించాలి

మహబూబాబాద్‌ అర్బన్‌: దివ్యాంగ పిల్లల వివరాలను తమ తల్లిదండ్రులు భవిత సెంటర్‌ నమోదు చేయించాలని జిల్లా ఇన్‌చార్జ్‌ విద్యాశాఖ అధికారి మందుల శ్రీరాములు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం దివ్యాంగుల ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మందుల శ్రీరాములు మాట్లాడుతూ.. భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ ఆధ్వర్యంలో వచ్చే పరికరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో శారీరక వైకల్యంకలిగిన వారు 42 మంది, మానసిక వైకల్యం 29 మంది, వినికిడి లోపం 25 మంది, అంధత్వం 3, సెరిబ్రల్‌ పాలసీ సంబంధిత దివ్యాంగ విద్యార్థులు 34 మంది ఉన్నారని, మొత్తం 133 మంది ఉపకరణాలకు దరఖాస్తులు చేసుకున్నారని పేర్కొన్నారు. ప్రతీ విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేసుకోవాలన్నారు.

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

మరిపెడ రూరల్‌: ప్రతీ ఒక్కరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని మరిపెడ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ వీసారపు ప్రగతిశ్రీపాల్‌రెడ్డి అన్నా రు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని చైర్‌పర్సన్‌ సందర్శించారు. ప్రజలు తమ ఆరోగ్యంపై అవగాహన కలిగి, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ మెరు గు రాము, వైద్యాధికారులు స్వామి, మంగ మ్మ, నాయకులు ఉపేందర్‌, సయ్యద్‌ సర్వర్‌పాషా, వాసవీ క్లబ్‌ మండల అధ్యక్షుడు గర్రెపల్లి నగేష్‌, భాసిత్‌ ఖాన్‌, ప్రేమ్‌సాగర్‌ తది తరులు పాల్గొన్నారు.

ప్రైవేట్‌ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలి

నెహ్రూసెంటర్‌: ప్రైవేట్‌ ఆస్పత్రులు, స్కానింగ్‌ సెంటర్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్‌ సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రులు, స్కానింగ్‌ సెంటర్లను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. ప్రైవేట్‌ ఆస్పత్రులు, స్కానింగ్‌ సెంటర్లు పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించొద్దన్నారు. ఆస్పత్రుల్లోని పలు రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో పీఓఎంహెచ్‌ఎన్‌ డాక్టర్‌ విరాజిత, డాక్టర్‌ శివకుమార్‌, డెమో రాజ్‌కుమార్‌, మనోహర్‌, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

29 పోస్టులకు 462 దరఖాస్తులు

తొర్రూరు: తొర్రూరు ప్రాజెక్టు పరిధిలో 29 అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకుగాను 462 దరఖాస్తులు అందినట్లు సీడీపీఓ మంద రేష్మ తెలిపారు. డివిజన్‌ కేంద్రంలోని ఐసీడీఎస్‌ కార్యాలయంలో మంగళవారం దరఖాస్తుల పరిశీలన కొనసాగింది. సీడీపీఓ మాట్లాడుతూ... తొర్రూరు ప్రాజెక్టు పరిధిలోని తొర్రూరు, పెద్దవంగర, నెల్లికుదురు మండలాల నుంచి అందిన దరఖాస్తుల్లో 180 దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని తెలిపారు. ఈ నెల 19 వరకు వెరిఫికేషన్‌ చేపడుతామన్నారు. కార్యక్రమంలో ఏసీడీపీఓ విజయలక్ష్మి, సూపర్‌వైజర్లు సుధ, జలగం సునీత, నార్లపురం సరిత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement