గంగారం : గంగారం రేంజ్ అటవీశాఖ అధికారిగా మయూరి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. కాగా, సిబ్బంది మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఆదివాసీ ప్రొఫెషనల్ గ్రూప్ ఇన్‌చార్జ్‌గా శోభన్‌బాబు
ఇనుగుర్తి: మండలంలోని అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన భూక్య శోభన్‌బాబుకు ఆదివాసీ ప్రొఫెషనల్ గ్రూప్ తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల ఇన్‌చార్జ్‌గా ఆదివారం నియమితులయ్యారు. ఇప్పటికే ఆల్ ఇండియా ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్‌గా, కర్ణాటక రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన నియామకంపై మండల, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రామప్పలో
అమెరికా దేశస్తుడు
వెంకటాపురం(ఎం): ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని అమెరికాకు చెందిన జాన్ చెర్మక్ ఆదివారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వర స్వామిని ఆయన దర్శించుకోగా అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్ తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేశ్ వారికి వివరించారు.
హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ
మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండల పరిధిలోని హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వయంభూ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వందల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ క్షేత్రం కోలాహలంగా మారింది. శ్రావణమాసం ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చారు. రాష్ట్రంలోని సుదూర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి వంటి ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, ఆటోలు, తదితర వాహనాల్లో ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్నారు. ఆలయ సమీపంలో పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు రాజశేఖర్‌శర్మ, పవన్‌కుమార్, ఈశ్వర్‌చంద్‌శర్మ, అనిపెద్ది రాజీవ్ శర్మ స్వామివారికి నిర్వహించిన తిలతైలాభిషేకం పూజలో పాల్గొని భక్తులు మానవ శరీరాన్ని పోలి ఉండే లక్ష్మీనర్సింహ స్వామిని దర్శించుకుని పులకించారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు నాభిచందన ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
నాటక ప్రదర్శన పోస్టర్ ఆవిష్కరణ
కాజీపేట రూరల్: సురభి నాటకాలను బతికించాలని కాజీపేట రైల్వే సీనియర్ డీఈఈ, రైల్వే జనరల్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్ జి.సూర్యనారాయణ అన్నారు. కాజీపేట రైల్వే జనరల్ ఇనిస్టిట్యూట్ కళావేదికపై ఆదివారం సమ్మక్క సారలమ్మ జీవిత కథ సురభి నాటక ప్రదర్శన పోస్టర్‌ను సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ మన సంస్కృతీ, సంప్రదాయాలను బతికించాలని జానపద కళలు, ఆధ్యాత్మికత, మన దేశ రాజుల రాజ్యాల వీరగాథలను తెలిపేందుకు సురభి నాటక ప్రదర్శనకు సహకరిస్తున్న రైల్వే ఇన్‌స్టిట్యూట్ వారిని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఇన్‌స్టిట్యూట్ సెక్రటరీ దేవులపల్లి రాఘవేందర్ మాట్లాడుతూ.. ఈ నెల 13న కాజీపేట రైల్వే కమ్యూనిటిహాల్‌లో సాయంత్రం 5 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మ జీవిత కథ సురభి నాటక ప్రదర్శన ఉంటుందని, ఈ ప్రదర్శనకు రైల్వే ఉద్యోగులు, కాజీపేట ప్రాంత ప్రజలు కుటుంబసమేతంగా వచ్చి నాటకాన్ని తిలకించాలని ఆయన కోరారు. కాజీపేట రైల్వే స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, సురభి నాటక సంస్థ అధ్యక్షుడు కొండల్‌రావు, ట్రెజరర్ కార్తీక్, కార్యదర్శి సురభి సంతోశ్, సభ్యులు నాగరాజు, ఇన్‌స్టిట్యూట్ జాయింట్ సెక్రటరీ రాజయ్య, ట్రెజరర్ రాజేశ్వర్‌రావు, సంస్కృత విభాగం ఇన్‌చార్జ్ రఘు, సభ్యులు పి.రవికిరణ్ పాల్గొన్నారు.


