● వరంగల్ పోలీసు కమిషనర్ ఎన్. శ్వేత
మామునూరు: పోలీసులు విధుల్లో రాణిస్తూ క్రీడల్లోనూ సత్తా చాటాలని వరంగల్ పోలీస్ కమిషనర్ (సీపీ) శ్వేత అన్నారు. మామునూరు టీజీ ఎస్పీ నాలుగో బెటాలియన్‌లో కమాండెంట్ ఎన్. వి. సత్య శ్రీనివాస ఆధ్వర్యంలో మూడు రోజులుగా ఉత్సాహంగా సాగిన ఇంటర్ –కంపెనీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 గురువారం ముగిసింది. ముఖ్యఅతిథిగా సీపీ హాజరై మాట్లాడారు. క్రీడలు మానసిక ఉల్లాసంతోపాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయన్నారు. అనంతరం విజేతలకు ట్రోఫీ అందజేసి అభినందించారు. ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, ఏసీపీ వెంకటేష్, మామునూరు ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఏసీ బాలయ్య, వీరన్న, రాజేందర్, విజయ్, కార్తీక్, రవి, రాజిరెడ్డి, సర్వర్, వెంకటేశ్వర్లు, ఆరజ్‌కుమార్, రాంప్రసాద్, పోలీస్ క్రీడాకారులు పాల్గొన్నారు.


