● కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో క్రీడల మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని వీసీ కె.ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని కళాశాలల ఫిజికల్ డైరెక్టర్ల(పీడీ)తో యూనివర్సిటీలోని సెనెట్‌హాల్‌లో నిర్వహించిన మీట్‌లోఆ యన మాట్లాడారు. ఖేల్ ఇండియా పథకంకింద క్రీడా వసతుల అభివృద్ధికి రూ.40 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు. విశ్వవిద్యాలయం పరిధిలో 386 కళాశాలలున్నాయని, వీటిలో ప్రిన్సిపాల్ తర్వాత ఫిజికల్ డైరెక్టర్ పాత్రే కీలకమన్నారు. అంతర్ విశ్వవిద్యాలయాల క్రీడాపోటీల్లో సుమారు 32 రకాలు ఉంటున్నాయని, కొత్త క్రీడలను కూడా పరిచయం చేసి విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో రిజిస్ట్రార్ వి.రామచంద్రం, స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ, పాలకమండలి సభ్యుడు బి.సురేశ్‌లాల్, యూనివర్సిటీ క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ టి.మనోహర్, కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు జె. సోమన్న మాట్లాడారు. మాజీ కేయూ స్పోర్ట్స్‌బోర్డు కార్యదర్శి వై. వెంకయ్య 2025–2026 క్రీడావార్షిక నివేదికను ప్రవేశపెట్టారు. క్రీడాకారులకు నాణ్యతతో కూడిన ట్రాక్‌స్యూట్ అందించాలని, మరికొన్ని సమస్యలు పరిష్కరించాలని ఫిజికల్ డైరెక్టర్లు అధికారులను కోరారు. కార్యక్రమంలో ఆచార్య రమేశ్‌రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్లు సావిత్రి, వెంకన్న, శ్రీనివాస్‌రెడ్డి, రాజేశ్, ఎటీబీటీప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.


