ఉమ్మడి జిల్లాలో పలువురు రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక, ఉపాధ్యాయులుగా ఎంపిక
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక, ఉపాధ్యాయ అవార్డులు ప్రకటించింది. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు ఆ అవార్డులకు ఎంపికయ్యారు. వీరికి ఈ నెల 5వ తేదీన కొడంగల్‌లోని ఓ కళాశాలలో అవార్డుల ప్రదానోత్సవం జరగబోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖమంత్రిగా ఈ అవార్డులను ప్రదానం చేయబోతున్నారు. అవార్డులతోపాటు రూ. 10వేల నగదు పురస్కారం కూడా అందించనున్నారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యారంగంలో వినూత్నంగా బోధించడం, పరిశోధనలు చేయడంతోపాటు పరిశోధకులకు మార్గదర్శకం వహించడం, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయడం లాంటి కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపకులు, ఉపాధ్యాయులుగా ఎంపికై న వారిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.


