విద్యారణ్యపురి : హనుమకొండ జిల్లా నుంచి ముగ్గురు టీచర్లు రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. మడికొండలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ కలసాని మాధవరెడ్డి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా విద్యాబోధన చేస్తున్నారు. 2016,2019లో రాష్ట్రస్ధాయి చెకుముకి సైన్స్‌టాలెంట్ టెస్టులో గైడ్ టీచర్‌గా భాగస్వాములయ్యారు. 2026లో రాష్ట్రస్థాయి ఫిజికల్‌సైన్స్ టాలెంట్ టెస్టులోనూ ఆయన మార్గదర్శకంలో ఓ విద్యార్థి టాప్–5లో నిలిచారు. అలాగే, హసన్‌పర్తి మండలం జయగిరి ఎంపీయూపీఎస్ ఎస్‌జీటీ ఎ. కుమారస్వామి టీఎల్‌ఎం టీచింగ్‌లెర్నింగ్ మెటీరియల్‌తో విద్యాబోధన చేస్తున్నారు. అంతేగాకుండా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారిస్తూ వారిలో అభ్యసనా సామర్థ్యాలు సాధించేలా కృషిచేస్తున్నారు. అలాగే, హసన్‌పర్తి టీజీఆర్‌ఎస్ గర్ల్స్ టీజీటీ సైన్స్ టీచర్ కేఎన్‌వీ రాజగోపాల్ విద్యార్థులకు అర్థమయ్యేలా సులభంగా బోధిస్తూ వారిలో ఆ శాస్త్రంపై ఆసక్తి పెంపొందడానికి కృషి చేస్తున్నారు.


