హసన్‌పర్తి : కమ్యూనిస్టులు లేని ప్రాంతాలు వెనుకబాటుకు గురయ్యాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. గురువారం హసన్‌పర్తి భీమారంలో అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి సంతాప సభ నిర్వహించారు. రాఘవులు ముఖ్య అతి థిగా హాజరై మాట్లాడుతూ భూమి, భుక్తి కోసం పో రాటం చేసింది కమ్యూనిస్టులేనన్నారు. వారి పో రాటంతోనే ప్రాజెక్ట్‌లు, కాల్వలు వచ్చాయన్నారు. మల్లారెడ్డి తన గ్రామంలో సర్పంచ్‌గా పనిచేసి ప్ర జలకు కావాల్సిన సౌకర్యాలు సమకూర్చారన్నారు. ఆయన చివరి శ్వాస వరకు పార్టీ కోసం పనిచేశారని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మా ట్లాడుతూ మల్లారెడ్డి మృతి పార్టీకి తీరని లో న్నా రు. రాజ్యాంగాన్ని ధిక్కరించేలా పాలకవర్గాలు వ్య వహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వరంగల్ పశ్చిమ, పరకాల ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వారాజు సారయ్య, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీ మేయర్ టి.రాజేశ్వర్‌రావు మాట్లాడారు. జిల్లాలో సాగునీరు కోసం, రైతాంగ సమస్యల కోసం నిరంతర పోరాటాలు నడిపిన నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి అని కొనియాడారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య మాట్లాడుతూ మల్లారెడ్డి ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నాగయ్య, సుదర్శన్, సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, నాయకులు రంగయ్య, వాసుదేవారెడ్డి, రమేశ్, చుక్కచయ్య, రాములు, మల్లారెడ్డి పాల్గొన్నారు.
సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు
రాఘవులు
మల్లారెడ్డికి ఘన నివాళి


