కాజీపేట రూరల్ : ప్రయాణికుల సౌకర్యార్థం కాజీపేట జంక్షన్ మీదుగా సుబేదార్‌ఘంజ్–యశ్వంత్‌పూర్–సుబేదార్‌ఘంజ్‌్ మ ధ్య సెప్టెంబర్ 11వ తేదీ నుంచి 26 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ గురువారం తెలిపారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు..
సెప్టెంబర్ 11 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు 13 సర్వీస్‌లుగా సుబేదార్‌ఘంజ్‌లో ప్రతీ శుక్రవారం బయలుదేరే సుబేదార్‌ఘంజ్–యశ్వంత్‌పూర్ (04135) ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు కాజీపేట జంక్షన్‌కు చేరుకుని వెళ్తుంది. సెప్టెంబర్ 14 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు 13 సర్వీస్‌లుగా యశ్వంత్‌పూర్‌లో ప్రతీ సోమవారం బయలుదేరే యశ్వంత్‌పూర్–సుబేదార్‌ఘంజ్ (04136) ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు కాజీపేట జంక్షన్‌కు చేరుకుని వెళ్తుంది. 33 ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో ప్రయాణించే ఈ రైళ్ల సర్వీస్‌లుకు అప్ అండ్ డౌన్‌లో శంకర్‌ఘర్, దాబుర, మాణిక్‌పూర్, సంత, కఠ్ని, జబల్‌పూర్, ఇటార్జీ, నాగ్‌పూర్, బల్హర్షా, సిర్పూర్‌కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, కాజీపేట, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, యాద్గిరి, కృష్ణ, రాయ్‌చూర్, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యెలహంక స్టేషన్‌లో హాల్టింగ్ కల్పించారు.
నేడు జన్‌సాధరణ్ రైళ్లు..
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాజీపేట జంక్షన్ మీదుగా శుక్రవారం సికింద్రాబాద్–సిర్పూర్‌కాగజ్‌నగర్, సిర్పూకాగజ్‌నగర్–హైదరాబాద్ మధ్య రెండు అన్‌రిజర్వుడ్ జన్‌సాధరణ్ ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ గురువారం తెలిపారు.
వివరాలు..
ఈనెల 4వ తేదీన (శుక్రవారం) సికింద్రాబాద్‌లో 12:10 గంటలకు బయలుదేరే సికింద్రాబాద్–సిర్పూర్‌కాగజ్‌నగర్ (07235) జన్‌సాధరణ్ ఎక్స్‌ప్రెస్ కాజీపేటకు 14:10 గంటలకు చేరుకుని సిర్పూర్‌కాగజ్‌నగర్‌కు 17:30 గంటలకు చేరుకుంటుంది. సిర్పూర్‌కాగజ్‌నగర్‌లో 18:00 గంటలకు బయలుదేరే సిర్పూర్‌కాగజ్‌నగర్–హైదరాబాద్ (07236) జన్‌సాధరణ్ ఎక్స్‌ప్రెస్ కాజీపేట 21: 15 గంటలకు చేరుకుని హైదరాబాద్‌కు 23:15 గంటలకు చేరుకుంటుంది. ఈ రైళ్లకు చర్లపల్లి, భువనగిరి, జనగామ, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్‌లో హాల్టింగ్ కల్పించారు.
11వ తేదీ నుంచి అమలు


