● శ్రావణ మాసంలో నూతన ఆలయానికి భూమిపూజ చేసే అవకాశం
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్దరణ లో భాగంగా పునర్నిర్మాణం కోసం హైదరాబాద్‌కు చెందిన క్షేత్ర కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో మట్టి పరీక్షల ను శుక్రవారం ప్రారంభించారు. దేవస్థానం నిర్మా ణం పూర్తిగా రాతితో చేపట్టనున్న నేపత్యంలో మట్టి గట్టితనంపై పరీక్షలు చేస్తున్నారు. మొత్తం దేవస్థా నం నిర్మాణ ప్రాంతంలో తొమ్మిది చోట్ల 30 నుంచి 40 ఫీట్ల మేర డ్రిల్లింగ్ చేపట్టారు. ఇప్పటికే నాలుగు డ్రిల్లింగ్ హోల్స్ వేశారు. మిగితావి శనివారం వరకు పూర్తి చేసి ల్యాబ్‌కు పంపిస్తామని కన్సల్టెన్సీ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికి వేసిన నాలుగు హోల్స్‌లో గట్టి బండరాయిలాంటి మట్టి వచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఇప్పటికే దేవస్థానం పాత ఆలయాలన్ని 90 శాతం వరకు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ నెలలో శ్రావణమాసం మొదలు కానుండడంతో సరికొత్త రాతి ఆలయ నిర్మాణానికి ముగ్గుపోసే ముహూర్తం ఖరారు కానుంది.


