మహాముత్తారం: ఓ వైన్స్‌లో, బైక్‌ను చోరీ చేసిన నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా కరీంనగర్ జిల్లా ముగ్దంపూర్ గ్రామానికి చెందిన భూతం ఆంజనేయులు, సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామానికి చెందిన మహంకాళి కమల్, కరీంనగర్ ఆదర్శనగర్‌లో నివాసం ఉంటున్న శివరాత్రి అభిలాష్, కరీంనగర్ మండలం మండులపల్లి గ్రామానికి చెందిన కవ్వంపల్లి అరుణ్ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో యామన్‌పల్లి గ్రామంలోని తెలంగాణ వైన్స్‌లో చోరీ, ఒక హీరోస్ప్లెండర్ మోటార్ సైకిల్‌ను దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. నిందితులనుంచి 5 బీరు బాటిళ్లు, 25 రాయల్‌స్టాగ్ క్వార్టర్ బాటిళ్లు, రూ.5వేలు నగదుతోపాటు చోరీకి వినియోగించిన స్విఫ్ట్ కారు, 2 స్మార్ట్‌ఫోన్లు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరిచినట్లు మహాముత్తారం ఎస్‌ఐ రమేష్ తెలిపారు.


