పరుగు పందెంలో పాల్గొన్న బాలలు జంప్ చేస్తున్న బాలుడు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో తెలంగాణ రాష్ట్రస్థాయి 1వ పిల్లల అథ్లెటిక్స్ పోటీలు, జావెలిన్ డే వేడుకలు శుక్రవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరగనున్న అథ్లెటిక్స్ మీట్‌లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 1,757 మంది అథ్లెట్లు హాజరైనట్లు తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ నిర్వహణ కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. అండర్–06, 08, 10, 12 బాలబాలికలు, యూత్ విభాగంలో అండర్–18 తో పాటు అండర్–14, 16, 20 మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి రోజు పిల్లల అథ్లెటిక్స్, జావెలిన్ త్రో పోటీలు ముగిసినట్లు తెలిపారు. రెండో రోజు యూత్ విభాగంలోని అండర్–18 బాలబాలికలకు వివిధ కేటగిరీల్లో పోటీలు ఉంటాయని వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. జావెలిన్ త్రో, డిస్కస్ త్రో, షాట్‌పుట్, హై జంప్, లాంగ్ జంప్, రన్నింగ్ లాంటి మెత్తం 60 ఈవెంట్లలో పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
హనుమకొండ జేఎన్‌ఎస్‌లో ప్రారంభం
వివిధ జిల్లాల నుంచి హాజరైన
1,757 మంది క్రీడాకారులు


