అథ్లెటిక్‌ ఈవెంట్‌ కాదు..! | - | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్‌ ఈవెంట్‌ కాదు..!

Aug 8 2026 1:53 AM | Updated on Aug 8 2026 1:53 AM

వరంగల్‌ స్పోర్ట్స్‌: ఇలా తీగలను దాటడం కూడా అథ్లెటిక్స్‌ పోటీల్లో ఓ ఈవెంట్‌ అని అనుకుంటే పొరబడినట్లే. జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలోని సింథటిక్‌ అథ్లెటిక్స్‌ ట్రాక్‌ లోపలికి వెళ్లే ప్రధాన గేటు దాటగానే కుడి వైపు సైడ్‌ట్రాక్‌కు అడ్డుగా ఇనుప తీగలను కట్టారు. అటు వైపు వెళ్లే అథ్లెట్లు తీగలను దాటేందుకు ఫీట్లు చేయక తప్పలేదు. కొందరు పిల్లలు తీగలను గమనించకపోవడంతో మెడకు తగిలి పడిపోయారు. హనుమకొండలోని జేఎన్‌ఎస్‌లో శుక్రవారం రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరిగే పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన అథ్లెట్లు వారి తల్లిదండ్రులు, టెక్నికల్‌ అఫీషియల్స్‌ ఇనుప తీగలతో ఇబ్బందులు పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement