తొర్రూరు: గుడుంబాపై ఆబ్కారీ శాఖ ఉక్కుపాదం మోపుతోంది. తొర్రూరు డివిజన్ పరిధిలోని గ్రామాలు, తండాల్లో నిఘా తీవ్రతరం చేస్తూ దాడులను విస్తృతం చేస్తోంది. గుడుంబా తయారీ, రవాణా కట్టడికి నిత్యం వాహన తనిఖీలు, దారికాపులు నిర్వ హిస్తున్నారు. గుడుంబా తయారీదారులపై ఎకై ్సజ్ శాఖ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. గుడుంబా తయారీకి వినియోగించే ముడి సరుకై న నల్లబెల్లం, పటికను స్వాధీనం చేసుకోవడంతో పాటు బెల్లం పానకాన్ని ధ్వంసం చేస్తున్నారు.
అనుమానితుల బైండోవర్..
గుడుంబా నియంత్రణలో భాగంగా అనుమానితులను తహసీల్దార్‌ల ఎదుట హాజరుపర్చుతున్నారు. బైండోవర్ నిబంధనలను అతిక్రమిస్తున్న వారికి భారీ జరిమానాలు విధిస్తున్నారు. జరిమానాలు చెల్లించని వారికి జైలు శిక్ష వంటి చట్టాలను అమలు చేస్తున్నారు. గుడుంబా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఎకై ్సజ్ శాఖ అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గుడుంబా వల్ల కలిగే అనర్థాలు, చట్టాలపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
విస్తృత దాడులు.. ఫలితాలు
గుడుంబా కట్టడిపై ఎకై ్సజ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఎకై ్సజ్ సీఐ బూస అశోక్ పర్యవేక్షణలో 2025 జూలై 25 నుంచి ఈ ఏడాది జూన్ 26 వరకు ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక దాడులు నిర్వహించారు. తొర్రూరు డివిజన్ పరిధిలోని పెద్దవంగర, దంతాలపల్లి, మరిపెడ, నర్సింహులపేట, నెల్లికుదురు, తొర్రూరు, చిన్నగూడూరు మండలాల్లో విస్తృత దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 396 మందిని తహసీల్దార్‌ల ఎదుట బైండోవర్ చేశారు. 694 మందిని అదుపులోకి తీసుకుని 725 కేసులు నమోదు చేశారు. 2697 లీటర్ల గుడుంబా, 76 టన్నుల నల్లబెల్లం, 4 టన్నుల పటికను స్వాధీనం చేసుకున్నారు. 53,170 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేయడంతో పాటు 143 వాహనాలను సీజ్ చేశారు. 20 మందిపై బ్రీచ్ కేసులు నమోదు చేసి వారికి రూ.7.55 లక్షల జరిమానా విధించారు. వివిధ నేరాల్లో పట్టుబడిన 176 వాహనాలకు వేలం వేశారు. వేలం ద్వారా రూ.97.71లక్షల ఆదాయం ఎకై ్సజ్ శాఖ గడిచింది.
పథకాల నిలిపివేతకు సిఫారసు..
నాటుసారా తయారీ, రవాణాపై ఎకై ్సజ్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపడంతో పాటు రైతు భరోసా, ఆసరా పింఛన్, రేషన్ బియ్యం తదితర ప్రభుత్వ పథకాల నిలిపివేతకు ఆయా శాఖలకు సిఫారసు చేస్తున్నారు.
ప్రణాళికతో నియంత్రణ
గుడుంబా రహిత డివిజన్‌గా తొర్రూరును మార్చడంలో భాగంగా ప్రణాళికతో దాడులు నిర్వహిస్తున్నాం. బెల్లం, పటిక అమ్మకాల నుంచి మొదలుకుని, నాటుసారా తయారీ, రవాణా చేసే వారిని గుర్తించి కేసులు నమోదు చేసాం. బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నాం. కేసులో రెండోసారి పట్టుబడితే బ్రీచ్ కేసు, రిమాండ్, జరిమానా తప్పదు. పట్టుబడిన వారిలో మార్పు రాకుంటే పీడీ యాక్టు నమోదు చేస్తాం.
–బూస అశోక్, తొర్రూరు ఎకై ్సజ్ సీఐ
మారుమూల గ్రామాల్లో ఎకై ్సజ్ శాఖ విస్తృత దాడులు
బెల్లం, పటిక రవాణాపై ప్రత్యేక నిఘా
694 మందిపై కేసులు, 396 మంది బైండోవర్
2,697 లీటర్ల నాటుసారా స్వాధీనం


