అధికారులు అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Aug 1 2026 1:31 AM | Updated on Aug 1 2026 1:31 AM

డోర్నకల్‌: భారీ వర్షాలతో వరదలు వచ్చే అవకాశాలు ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ ఆదేశించారు. స్థానిక కొర్లకుంట, బ్రాహ్మణకుంటను శుక్రవారం మరో అదనపు కలెక్టర్‌ పురుషోత్తంతో కలిసి పరిశీలించారు. గతేడాది కొర్లకుంటకు వరద పోటెత్తి రైల్వే స్టేషన్‌తో పాటు పలు ప్రాంతాలు ముంపునకు గురికావడం, ప్రస్తుతం భారీ వర్షాలు పడే అవకాశాలు ఉండడంతో స్థానిక అధికారులతో కలిసి అదనపు కలెక్టర్లు కుంటలను పరిశీలించారు. కొర్లకుంట చివరన రైల్వేశాఖ నిర్మించిన రక్షణ గోడను పరిశీలించారు. కొర్లకుంటకు హద్దులు నిర్ణయించాలని, వరద ప్రవాహానికి ఆటంకాలు తొలగించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. కొర్లకుంట నుంచి పెద్ద చెరువు వరకు ఉన్న వరద కాలువలో చెట్లు, వ్యర్థాలను తొలగించాలని మున్సిపల్‌ సిబ్బందిని ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్‌, మున్సిపల్‌ సిబ్బంది సమన్వయంతో పని చేసి వరద ముప్పు వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వి.రాఘవరెడ్డి, ఎంపీడీఓ ఆంజనేయులు, మున్సిపల్‌ కమిషనర్‌ నాగరాజు, మున్సిపల్‌ ఏఈ శృతి, ఇరిగేషన్‌ ఏఈ కిషన్‌, ఆర్‌అండ్‌బీ డీఈ లక్ష్మీనారాయణ, రైల్వే ఐఓడబ్ల్యూ శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు మైనుపాషా, వ్యాస్‌ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement