అందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యం | - | Sakshi
Sakshi News home page

అందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యం

Jul 14 2026 1:12 AM | Updated on Jul 14 2026 1:12 AM

కేసముద్రం: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు అందరి సహకారం ఉండాలని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫైర్‌స్టేషన్‌, డీసీసీ బ్యాంక్‌ను ఆయన ప్రారంభించారు. మండలంలోని కాట్రపల్లి గ్రామంలో శివాలయం పునఃనిర్మాణానికి శంకుస్థాపన, బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌, ఎంపీ పోరిక బలరాంనాయక్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు. కేసముద్రం మార్కెట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసముద్రంలో ఫైర్‌స్టేషన్‌ ఏర్పాటుతో 30ఏళ్ల కల సాకారమైందన్నారు. కేసముద్రంలో జరిగే రోడ్డు విస్తరణ పనులకు ఇక్కడి ప్రజలు స్వచ్ఛందంగా తమ ఇళ్లను కూల్చుకుని అభివృద్ధికి సహకరించడం గొప్ప విషయమన్నారు. ఇళ్లు కోల్పోయిన ప్రతీ ఒక్కరికి ఇళ్లు ఇప్పిస్తామన్నారు. కేసముద్రం మార్కెట్‌ ముందు చిరుదుకాణాలను కోల్పోయిన వారికి షాపింగ్‌ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో కోట్ల రూపాయల నిధులతో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, రోడ్ల విస్తరణ, కమ్యూనిటీ హాల్స్‌ వంటి పనులను చేపడుతున్న విషయం తెలిసిందేనన్నారు. రాష్ట్రంలోనే కేసముద్రం మున్సి పాలిటీలో పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద లైటింగ్‌ సిస్టం ఏర్పాటు కావడం సంతోషకరమన్నారు. కేసముద్రం మార్కెట్‌ చైర్మన్‌ గంట సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్టేట్‌ఫైర్‌ డీజీ విక్రంసింగ్‌మాన్‌, కలెక్టర్‌ స్నేహశబరీష్‌, కేసముద్రం మున్సి పల్‌ చైర్‌పర్సన్‌ సునీతవెంకన్న, వైస్‌చైర్‌పర్సన్‌ రమనాగేశ్వర్‌రావు, జిల్లా ఫైర్‌ అధికారి శ్రీనాథ్‌, మానుకోట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జ్యోతి, డీసీసీ బ్యాంక్‌ రీజనల్‌ అధికారి చైతన్య, మహిళా కమిషన్‌ సభ్యురాలు నూనావత్‌ రాధ, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉమ, నాయకులు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి, వద్దిరాజు కిషన్‌, నీలం దుర్గేష్‌ తదితరులు పాల్గొన్నారు.

రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి

కేసముద్రంలో ఫైర్‌స్టేషన్‌, డీసీసీ బ్యాంక్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement