నెహ్రూసెంటర్: విద్యుత్‌శాఖ ఏఈలు ప్రతీ వారంలో మంగళ, గురు, శనివారాల్లో ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించి వినియోగదారుల సమస్యలు తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని విద్యుత్‌శాఖ డైరెక్టర్ మధుసూదన్, చీఫ్ ఇంజనీర్ రాజు చౌహాన్ సూచించారు. విద్యుత్‌శాఖ మహబూబాబాద్ సర్కిల్ పరిధిలోని అధికారులతో శుక్ర వారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఓవర్‌లోడ్ ట్రాన్స్‌ఫార్మర్లు, 33 కేవీ ఫీడర్ల పనులు, మిగిలిన పనులన్నింటినీ ఈ నెలలో పూర్తి చేయాలని ఆదేశించారు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే వెంటనే తనిఖీలు చేసి వాటిని మార్చాలని సూచించారు. వినియోగదారులకు అసౌకర్యం కలిగించకుండా అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. విద్యుత్ స్తంభాల నంబర్లను పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రజాబాట కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. సమీక్ష సమావేశంలో ఎస్‌ఈ విజేందర్‌రెడ్డి, డీఈలు, ఏడీఈలు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.


