కన్నాయిగూడెం : నాడు జలకళను సంతరించుకున్న గోదావరి జీవనది.. నేడు నీరులేక సమ్మక్క సాగర్ బ్యారేజీ దిగువన ఇసుక మేటలు తేలి ఎడారిగా దర్శనమిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వ చ్చే నెలలో నీటి నిల్వలు పూర్తిగా తగ్గే పరిస్థితి ఉంది. దీంతో మండలంలో నీటి లభ్యత వనరుల్లో కొర త ఏర్పడుతుందని స్థానికులు చర్చించుకుంటున్నా రు. మండలంలోని తుపాకులగూడెం వద్ద ఉన్న స మ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద నీటిని నిల్వ చేయడంతో పైన మాత్రం జలకళ సంతరించుకుంది. దిగువ న కొంత నీరు మాత్రమే వస్తుండడంతో గోదావరి ప్రాంతం ఎడారిగా మారిపోయింది. దీంతో బ్యా రేజీ దిగువలోని గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది.
సమ్మక్క సాగర్ ఎగువన జలకళ..
వర్షాకాలంలో నీటి ప్రవాహంతో జలకళను తలపించిన గోదావరి ప్రాంతంలో ప్రస్తుతం నీరులేక ఇసుక మేటలు తేలాయి. ఎగువన ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద నీటి నిల్వతో బ్యారేజీ ప్రాంతం నిండుకుండను తలపిస్తుంది. కాగా గుట్టగంగారం వద్ద జె. చొక్కారావు ఎత్తిపోతల నుంచి నీటిని దిగువకు గొల్లబుద్ధారం రిజర్వాయర్‌కు నీటిని పంపింగ్ చేస్తున్నారు.
ఎగువ నుంచి తగ్గుతున్న ఇన్‌ఫ్లో..
తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీ లోకి ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో క్రమంగా త గ్గుతోంది. వర్షాకాలంలో బ్యారేజీలోకి లక్షల క్యూసెక్కుల నీరు చేరినప్పటికి అది తగ్గుతూ.. ప్రస్తుతం 4,500 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అందులో బ్యా రేజీ గేట్లను ఎత్తి 3,086 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో పాటు దేవాదుల ఎత్తిపోతల నుంచి 1,414 క్యూసెక్కుల నీరు పంపింగ్ చేస్తు నీటిని దిగువకు ఎత్తిపోస్తున్నారు. రానున్న కాలంలో మిషన్ భగీరథకు నీటి కష్టాలు ఉంటాయని స్థానికులు చర్చించుకుంటున్నారు.
గోదావరి బ్యారేజీ దిగువన తేలిన
ఇసుకమేటలు


