ఆటోను ఢీకొట్టిన టిప్పర్‌ | - | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొట్టిన టిప్పర్‌

Apr 11 2026 9:28 AM | Updated on Apr 11 2026 9:28 AM

23 మందికి గాయాలు

వెంకటాపురం(ఎం) : కూలీలతో వెళ్తున్న ఆటోను వెనకనుంచి టిప్పర్‌ ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న 23 మంది మహిళలకు గాయాలయ్యాయి. ఎస్సై చల్లా రాజు కథనం ప్రకారం.. మండలంలోని వెల్తుర్లపల్లికి చెందిన మహిళలు శుక్రవారం ఉదయం కూలీ పనికి గణపురం వెళ్తున్నారు. మణుగూరు నుంచి భూపాలపల్లికి వస్తున్న టిప్పర్‌ ఆటోను ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తు న్న గుంటోజు సుగుణమ్మ, కాల్వచర్ల శ్రీలత, గోస్కుల సమ్మయ్య, కడారి ఒదెమ్మ, పొలం సారయ్య, రమాదేవిలకు తీవ్ర గాయాలైనట్లు ఎస్సై తెలిపారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో చికిత్స కోసం ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్‌ సలీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

మంత్రి సీతక్క పరామర్శ

రోడ్డు ప్రమాదంలో గాయపడిన కూలీలను ములుగు ప్రభుత్వ ఆస్పత్రిలో మంత్రి సీతక్క పరామర్శించారు. క్షత్రగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆమె వైద్యులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement