కవచ్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌ | - | Sakshi
Sakshi News home page

కవచ్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

Apr 11 2026 9:28 AM | Updated on Apr 11 2026 9:28 AM

కాజీపేట–పొత్కపల్లి స్టేషన్ల మధ్య టెస్ట్‌

కాజీపేట రూరల్‌ : కాజీపేట–పొత్కపల్లి రైల్వేస్టేషన్‌ మధ్య శుక్రవారం హైస్పీడ్‌ కారిడార్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌ అయిందని రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట జంక్షన్‌ నుంచి ఉదయం కవచ్‌ ట్రయల్‌ రన్‌కు సంబంధించిన పరికరాలతో రెండు లోకోలతో ప్రారంభభమైన కవచ్‌ ట్రయల్‌ రన్‌ హసన్‌పర్తి, జమ్మికుంట, బిష్‌గిరిషరీఫ్‌, పొత్కపల్లి వరకు సాగింది. ఈ ట్రయల్‌ రన్‌లో రెండు లోకోల మధ్య ట్రాక్‌పై కొద్ది దూరంలో హెడ్‌ ఆన్‌ కొలిజన్‌ టెస్ట్‌, సైడ్‌ కొలిజన్‌ టెస్ట్‌ అనుకోకుండా జరిగే ప్రమాదాల నివారణ టెస్ట్‌, లోకో బ్రేక్‌ల టెస్ట్‌ జరిగిందని తెలిపారు. మరో రెండ్రోజుల పాటు ట్రయల్‌ రన్‌ ను ఉంటుందని వివరించారు. ట్రయల్‌ రన్‌ డీఎస్‌టీఈ ప్రా జెక్ట్‌ యుగేందర్‌, లోకో ఇన్‌స్పెక్టర్‌, ట్రాిఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌, హెచ్‌బీఎల్‌ కంపెనీ బృందం ఆధ్వర్యంలో సాగిందన్నారు. కవచ్‌తో ప్రమాదాల నివారణ, భద్రత ఉంటుందని భవిష్యత్‌లో సేఫ్టి ఇంటిగ్రేటెడ్‌ లెవెల్‌ జీరో (సిల్‌–0) విధానంతో ఇంటర్నె ట్‌ ద్వారా సిగ్నల్స్‌ లేకుండా వ్యవస్థ కొనసాగనుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. కవచ్‌ ట్రయల్‌ రన్‌ ప్రారంభంలో కాజీపేట స్టేషన్‌ మేనేజర్‌ అగ్గి రవీందర్‌, సీనియర్‌ సెక్షన్‌ రిటైర్డ్‌ ఇంజనీర్‌ సిగ్నల్‌ ప్రాజెక్ట్‌ పీఎంఎస్‌ రామిండ్ల సారంగపాణి, టెలి ప్రాజెక్ట్‌ పీఎంఎస్‌ ఎం.సంపతి పాల్గొన్నారు.

ఆటోమెటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ తనిఖీ

కాజీపేట–బల్లార్షా మార్గంలో శుక్రవారం జమ్మికుంట నుంచి రామగుండం వరకు 20 కి.మీ. మేర చేపట్టిన నూతన ఆటోమెటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ (ఏబీఎస్‌) సిస్టంను దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ అధికారులు తనిఖీ చేశారు. సికింద్రాబాద్‌ నుంచి స్పీక్‌లో సీఎస్‌టీఈ ప్రాజెక్ట్‌ ఎం.కోటేశ్వర్‌రావు, డిప్యూటీ సీఎస్‌టీఈ ప్రాజెక్ట్‌ జి.కుమారన్‌, ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించారు. ఆటో మెటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ను ఈ నెల 16న ప్రాంభించన్నారు. ట్రాక్‌ పొడవునా ప్రతి కిలోమీటర్‌కు సిగ్నల్‌ పాయింట్‌ ఉంటుందని, స్టేషన్‌ మాస్టర్‌ ప్రతిసారి ట్రెయిన్‌కు సిగ్నల్‌ ఇవ్వనవసరం లేదని, కావల్సిన సమయంలో సిగ్నల్‌ ఆటోమెటిక్‌గా రిలీజ్‌ అవుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement