● హత్య చేశారని బంధువుల ఆరోపణ?
బచ్చన్నపేట : అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని ఆలింపూర్ గ్రామంలో శుక్రవారం జరిగింది. కాగా మహిళా మృతదేహం సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గుట్టల్లో లభ్యమైంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఆలింపూర్ గ్రామానికి చెందిన పటాన్ జరీనాకు (39) భర్త మృతి చెందడంతో ఆమె తన ఇద్దరు కుమారులతో కలిసి ఉంటున్నారు. కొన్నాళ్లు జనగామలో హోటల్ నిర్వహిస్తు జీవనం గడిపింది. ఇటీవల ఆలింపూర్‌కు వచ్చి ఉంటోంది. ఈక్రమంలో బుధవారం ఆమె ఆలింపూర్ నుంచి బయటికి వెళ్లి చుంచనకోట గుట్టల్లో శవమై తేలింది. గురువారం సాయంత్రం చేర్యాల పోలీసులు అనుమానాస్పద మహిళగా గుర్తించి సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. బంధువులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వెళ్లి చూసి మృతురాలు జరీ నాగా గుర్తించారు. కొంత మంది ఆమె తలపై బండరాళ్లతో కొట్టి హత్య చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. చేర్యాల పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జరీనా మృతితో ఆ లింపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
వడదెబ్బతో మహిళ..
ఎల్కతుర్తి : కూలీ పనికి వెళ్లి ట్రాక్టర్‌లో ఇంటికి వస్తున్న ఓ మహిళ వడదెబ్బ తగిలి తీవ్ర అస్వస్థతకు గురై మార్గమధ్యలో మృతిచెందింది. ఈ సంఘటన ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ గ్రామానికి చెందిన బరిగెల శోభ (45) మండలంలోని కోతులనడుమ గ్రామానికి సీడ్ పనులకు వచ్చి ట్రాక్టర్‌లో తిరిగి వెళ్తోంది. కాగా మార్గమధ్యలో గోపాల్‌పూర్ వద్ద వడదెబ్బ తగిలి తీవ్ర అస్వస్థతకు గురై ట్రాక్టర్ ట్రాలీలోనే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం తెలు సుకున్న కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి న్యాయం కోసం ఆందోళన నిర్వహించారు. సమాచారం అందుకున్న ఎస్సై ప్రవీణ్‌కుమార్ సంఘటన స్థలా నికి చేరుకొని వారికి నచ్చజెప్పడంతో ఆందోళ న విరమించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం
ఖిలా వరంగల్ : పట్టాలు దాటుతున్న ఓ వ్యక్తిని ప్రమాదవశాత్తు కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం నెక్కొండ మండలంలోని రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. వరంగల్ జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ సుదర్శన్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన చిట్యాల ఈశ్వర ప్రసాద్ (46) పుట్టుకతో చెవిటి, మూగ. వ్యక్తిగత పనిపై నెక్కొండకు చేరుకున్న అతడు అమ్మాపురం వెళ్తున్న క్రమంలో నెక్కొండ రైల్వే స్టేషన్ సమీప యార్డ్ వద్ద రైలు పట్టాలు దాటుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టడంతో ఈశ్వర ప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని అతని కుమారుడు సాయిరాంకు అప్పగించినట్లు జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ సుదర్శన్ తెలిపారు.


