28 నుంచి మే 5వ తేదీ వరకు నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనులు | - | Sakshi
Sakshi News home page

28 నుంచి మే 5వ తేదీ వరకు నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనులు

Apr 11 2026 9:28 AM | Updated on Apr 11 2026 9:28 AM

10 రైళ్లు రద్దు

కాజీపేట రూరల్‌ : విజయవాడ డివిజన్‌లోని రాయనపాడు యార్డు రీమోడలింగ్‌తో చేపట్టిన నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ వర్క్స్‌తో ఈ నెల 28వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు ప్రతి రోజు ప్రయాణించే పలు ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం రైల్వే అధికారులు తెలిపారు.

రద్దయిన రైళ్ల వివరాలు..

ఈ నెల 28 నుంచి మే 5వ తేదీ వరకు విజయవాడ–భద్రాచలం రోడ్‌ (67215) వెళ్లే ప్యాసింజర్‌, భద్రాచలం రోడ్‌–విజయవాడ (67216) వెళ్లే ప్యాసింజర్‌, విజయవాడ–డోర్నకల్‌ (67768) వెళ్లే ప్యాసింజర్‌, డోర్నకల్‌–విజయవాడ (67767) వెళ్లే ప్యాసింజర్‌ రైళ్లు రద్దు కానున్నాయి. మే 2 నుంచి 5వ తేదీ వరకు, కాజీపేట, వరంగల్‌ మీదుగా విజయవాడ–సికింద్రాబాద్‌ (12713) వెళ్లే శాతవాహన ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌–విజయవాడ (12714) వెళ్లే శాతవాహన ఎక్స్‌ప్రెస్‌, గుంటూరు–సికింద్రాబాద్‌ (17201) వెళ్లే గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌–విజయవాడ (17202) వెళ్లే గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, గుంటూరు–సికింద్రాబాద్‌ (12705) వెళ్లే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌–గుంటూరు (12706) వెళ్లే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.

లాకప్‌ డెత్‌పై విచారణ

న్యూశాయంపేట : వరంగల్‌ జిల్లా గీసుకొండ పోలీస్‌ స్టేషన్‌లో 2003 మార్చి 7న కస్టడీలో ఉన్న పొలం వంశీకృష్ణ అనుమానాస్పద మృతిపై కలెక్టర్‌ మేజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో వరంగల్‌ ఆర్డీఓ సుమ శుక్రవారం విచారణ చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యులు తమ గోడును ఆర్డీఓకి వివరించారు. ఆ సమయంలో స్టేషన్‌లో ఉన్న ఇతర సాక్షులు, పోస్టుమార్టం తదితర నివేదికలను పరిశీలించి వారి వాంగ్మూలాలు సేకరించారు. ఈ నివేదికను కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు ఆర్డీఓ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement