ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

Apr 11 2026 9:28 AM | Updated on Apr 11 2026 9:28 AM

హసన్‌పర్తి : నగరంలోని ఓ ఇంట్లో ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్‌, స్థానిక పోలీసులు దాడి చేసి 12 మందిని అరెస్ట్‌ చేశారు. వీరినుంచి సెల్‌ఫోన్లతో పాటు రూ.1.06 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు హనుమకొండ ఏసీపీ నర్సింహారావు తెలిపారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. 56వ డివిజన్‌ గోపాలపురంలోని వేంకటేశ్వర కాలనీకి చెందిన గట్ల రాజేష్‌ ఇంట్లో ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్‌, స్థానిక పోలీసులకు సమాచారం అందగా దాడి చేసినట్లు పేర్కొన్నారు. అక్కడ ఓ వెబ్‌సైట్‌లో తమ ఫోన్లలో డబ్బులు పెట్టి క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. బెట్టింగ్‌కు పాల్పడుతున్న చింతగట్టుకు చెందిన గర్నపల్లి అరవింద్‌కుమార్‌, తూర్పుకోటకు చెందిన చిట్ల రాజేష్‌, దేవర వినయ్‌, జెట్టబోయిన కుమార్‌, చింతగట్టుకు చెందిన ముప్పారపు రాజేంద్రప్రసాద్‌, శ్రీపతిపల్లికి చెందిన వంగ శివకుమార్‌, బాషబోయిన శ్రీకాత్‌, ఈర్ల విఘ్నేష్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం కొత్తపల్లికి చెందిన గంగుల అనిల్‌, బూర మధుకర్‌, పులిగిళ్ల రవీందర్‌ బాబుతో పాటు బెట్టింగ్‌ నిర్వహిస్తున్న రాజేష్‌ను అరెస్ట్‌ చేసినట్లు ఏసీపీ నర్సింహారావు తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజు, కేయూ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ సుంకరి రవికుమార్‌, ఎస్సై నవీన్‌, ఆర్‌ఎస్సైలు భానుప్రకాశ్‌, సంతోష్‌, జె.రాజశేఖర్‌, సురేందర్‌, పి.సురేందర్‌, ఎన్‌.సాంబరాజు, ఏఏఓ సల్మాన్‌ పాల్గొన్నారు.

వివరాలు వెల్లడించిన

హనుమకొండ ఏసీపీ నర్సింహారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement