● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
మహబూబాబాద్ రూరల్ : మార్కెట్‌లో వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాల సమయాల్లో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేదిలేదంటూ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి దినపత్రికలో ‘మక్క రైతు చిత్తు’ అనే శీర్షికన గురువారం ప్రచురితమైన కథనంపై ఎమ్మె ల్యే స్పందించారు. మానుకోట వ్యవసాయ మార్కె ట్ యార్డును సందర్శించి మక్కల కొనుగోళ్ల తీరు ను పరిశీలించి సంబంధిత అధికారులతో మా ట్లాడారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండించి విక్రయించేందుకు తీసుకువస్తున్న రైతులకు మార్క్‌ఫెడ్ శాఖ అధికారులు సహకరించి సకాలంలో కొనుగో ళ్లు జరపాలన్నారు. రైతులు వ్యవసాయ మార్కెట్ యార్డులో పడిగాపులు పడకుండా ప్రత్యేక చొరవ తీసుకుని కొనుగోళ్లు నిర్వహించి ఆర్థికంగా నష్టపోకుండా చూడాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో రైతులు మొక్కజొన్నలు విక్రయించేలా అవగాహన కల్పించాలని సూచించారు. తేమ శాతం వచ్చిన వాటిని కొనుగోలు చేసి వెంటనే కాంటాలుపెట్టి తరలించాలన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోత్ జ్యోతి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, వైస్ చైర్మన్ మదన్ గోపాల్ లోయ, సెక్రటరీ సృజన్ బాబు, రైతులు, కాంగ్రెస్ నాయకులు అంబటి వీరభద్రం, మిట్టకంటి రామిరెడ్డి తదితరులు ఉన్నారు.


