న్యూశాయంపేట : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న తెలంగాణ మైనార్టీ గురుకులాల్లో వంద శాతం అడ్మిషన్లు సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ మైనార్టీ గురుకులాల విద్యాసంస్థ(టెమ్రిస్) డిప్యూటీ సెక్రటరీ జుబేదా బేగం తెలిపారు. గురువారం హనుమకొండ కేయూ క్రాస్‌లోని వరంగల్(జి1) బాలికల గురుకులంలో ఉమ్మడి వరంగల్ జిల్లా రీజినల్ కో–ఆర్డినేటర్ జంగా సతీశ్ అధ్యక్షతన ప్రిన్సిపాళ్లతో జరిగిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిండంతో పాటు నాణ్యమైన విద్యనందించే దిశగా ముందుకు సాగాలన్నారు. కార్పొరేట్ స్థాయిలో ఉన్న మైనార్టీ గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో విజిలెన్స్ అధికారులు సయ్యద్ అక్బర్, మక్బూల్‌పాషా, కో–ఆర్డినేటర్ రుహీనా, ప్రిన్సిపాళ్లు భిక్షపతి, కృష్ణకుమారి, నీరజ, నీలిమాదేవి, శ్రీపాల, శ్రీనివాస్, శ్రీనివాస్‌రావు, రాజు, కుమార్, మాధవి, శ్రీలత, రిజ్వానా షమీమ్, అన్నపూర్ణ, శ్రీలత, రహీం, అనిల్ బాబు, కౌన్సిలర్ సర్వర్ ఘాజీ, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.
టెమ్రిస్ డిప్యూటీ సెక్రటరీ జుబేదాబేగం


