డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Apr 10 2026 9:39 AM | Updated on Apr 10 2026 9:39 AM

డిగ్రీ 1,3,5 సెమిస్టర్ల (బ్యాక్‌లాగ్‌) పరీక్షలు కూడా..

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ బీఏ (ఎల్‌) రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ల పరీక్షల షెడ్యూల్‌ను పరీక్షల విభాగం అధికారులు గురువారం విడుదల చేశారు. రెండో సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 20, 22, 24, 27, 29, మే1, 4, 6వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తామని కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు తిరుమలాదేవి, వెంకటయ్య తెలిపారు. నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 21,23, 25, 28, 30, మే 2, 5, 7, 11 తేదీల్లో, ఆరో సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 20, 22, 24, 27, 29, మే 1, 4, 6, 8, 12, 14తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు.

బ్యాక్‌లాగ్‌ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్‌ పరీక్షల టైంటేబుల్‌ కూడా విడుదల చేశారు. డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఏ (ఎల్‌ ) పరీక్షల ఐదో సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 21, 23, 25, 28, 30, మే 2, 5, 7, 11, 13 తేదీల్లో, మొదటి సెమిస్టర్‌ పరీక్షలు మే 7, 8, 11, 13, 15, 18, 20, 22 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తారు. మూడో సెమిస్టర్‌ పరీక్షలు మే 12, 14, 16, 19, 21, 23, 25, 26. 28 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటలవరకు నిర్వహిస్తామని పరీక్షల విభాగం అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement