వ్యాపారుల ఆందోళనతో నిలిచిన కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

వ్యాపారుల ఆందోళనతో నిలిచిన కొనుగోళ్లు

Apr 10 2026 9:39 AM | Updated on Apr 10 2026 9:39 AM

ఖిలా వరంగల్‌ : గాయత్రి మిర్చి యజమాని రూ.3కోట్లతో పరారైన విషయం విధితమే. ఈ ఘటనలో సదరు వ్యాపారిని చట్ట ప్రకారం శిక్షించి న్యాయం చేయాలని వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ ప్రధాన కార్యాలయం ఎదుట చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో గురువారం వ్యాపారులు ఆందోళన నిర్వహించారు. దీంతో మిర్చి, ఇతర కొనుగోళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం తెలిసి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వ్యాపారులతో మాట్లాడి ఆందోళనను విరమింప చేశారు. అనంతరం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ వ్యాపారుల నుంచి సుమారు రూ.3కోట్ల మిర్చి కొనుగోలు చేసి పరారైన గాయత్రి చిల్లీస్‌ యజమానిని చట్ట ప్రకారం శిక్షించి సహ వ్యాపారులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యవర్గ ప్రతినిధులు వేద ప్రకాశ్‌, సాగర్ల శ్రీనివాస్‌, పూర్వ అధ్యక్షుడు కటకం పెంటయ్య, అడ్తి సెక్షన్‌ అధ్యక్షుడు లింగారెడ్డి, చంద్రమౌళి, అల్లెం సంపత్‌, కంచె సంపత్‌, రమేశ్‌, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

రైతుల నిరసన..

వరంగల్‌ మార్కెట్‌లో గురువారం ఉదయం వ్యాపారులు ఆ ందోళన చేయడంతో క్రయవిక్రయాలు నిలిచాయి. ఉద యం పది గంటలు దాటినా కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో రైతులు నిరసనకు దిగారు. వెంటనే మార్కెట్‌ అధికా రులు, పోలీసులు .. వ్యాపారులు, రైతులతో చర్చలు జరిపా రు. ఆలస్యమైనా కొనుగోళ్లను యాథావిధిగా కొనసాగాయి.

పోలీసుల అదుపులో మిర్చి వ్యాపారి?

ఏనుమాముల పోలీస్‌లు గురువారం గాయత్రి మిర్చి వ్యాపారిని అదుపులో తీసుకున్నట్లు తెలిసింది. తమదైన శైలిలో విచారణ చేపడుతున్నట్లు సమాచారం. నిందితుడు గతంలో కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో ఇలాగే వ్యాపారంలో మోసం చేసి ఐపీ పెట్టి వరంగల్‌కు మకాం మార్చినట్లు తెలిసింది.

రూ.3కోట్లతో పరారైన గాయత్రి

మిర్చి యజమాని

న్యాయం చేయాలని ‘చాంబర్‌’

ఆధ్వర్యంలో నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement