సర్వీస్‌ రూల్స్‌ వర్తింపజేయాలి | - | Sakshi
Sakshi News home page

సర్వీస్‌ రూల్స్‌ వర్తింపజేయాలి

Apr 10 2026 9:39 AM | Updated on Apr 10 2026 9:39 AM

ఆర్టిజన్‌ ఉద్యోగులకు
టీఎస్‌ఈఈయూ–327 వరంగల్‌ జిల్లా కార్యదర్శి బుచ్చయ్య గౌడ్‌

హన్మకొండ: విద్యుత్‌ ఆర్టిజన్‌ ఉద్యోగులకు ఏపీఎస్‌ఈబీ సర్వీస్‌ రూల్స్‌ వర్తింపజేయాలని తెలంగాణ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ వరంగల్‌ జిల్లా కార్యదర్శి మచ్చిన బుచ్చయ్య గౌడ్‌ డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ ఆర్టిజన్ల సమ్మె రెండో రోజు గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్‌ హనుమకొండ సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమ్మె శిబిరం వద్ద కొనసాగింది. దీనికి ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఆర్టిజన్‌లను అర్హతను బట్టి రెగ్యులర్‌ ఉద్యోగులుగా కన్వర్షన్‌ చేయాలన్నారు. టీఎస్‌ఈఈయూ–327 హనుమకొండ జిల్లా కార్యదర్శి చిట్ల ఓదెలు, టీఆర్‌పీఏయూ నాయకులు మహేశ్‌, వెంకటరమణ, ఉపేందర్‌, సాయి కృష్ణ, టీఎస్‌ఈయూ–1104 నాయకులు శ్రీకాంత్‌, హరిహరాచారి సమ్మెకు సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. ఆర్టిజన్‌ ఉద్యోగుల హనుమకొండ జిల్లా జేఏసీ చైర్మన్‌ కోరుకొప్పుల రాంబాబు, నాయకులు మట్ల భిక్షపతి, నల్ల రాంబాబు, గజ్జల కుమార్‌, గడ్డం ప్రభాకర్‌, గండికోట ప్రసాద్‌, వెంకట్‌, వరుణ్‌, పూర్ణాచారి, శ్రీధర్‌, మహేందర్‌, మానస, జ్యోతి పాల్గొన్నారు.

ట్రాన్స్‌కో జోనల్‌ కార్యాలయం వద్ద...

టీజీ ట్రాన్స్‌ కో ఆర్టిజన్‌ ఉద్యోగులు రెండో రోజు సమ్మెలో పాల్గొన్నారు. హనుమకొండ పెద్దమ్మగడ్డలోని ట్రాన్స్‌ కో జోనల్‌ కార్యాలయం వద్ద ఆర్టిజన్లు ధర్నా చేపట్టారు. టీఆర్‌వీకేఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాడ దేవేందర్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలవాలని డిమాండ్‌ చేశారు. ఏఐటీయూసీ ట్రాన్స్‌ కో రాష్ట్ర కన్వీనర్‌ వడ్డేపల్లి శ్రీనివాస్‌ సంఘీభావం తెలిపారు. టీవీఏఈ జేఏసీ ట్రాన్‌న్స్‌కో రాష్ట్ర కన్వీనర్లు కందికొండ వెంకటేష్‌, భరత్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లా చైర్మన్‌ ఐలయ్య, కన్వీనర్‌ రాజన్న, జనరల్‌ సెక్రెటరీ సునీల్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement